కరీంనగర్

ఓటు వజ్రాయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 22: ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు నైతికతతో ఓటు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం సాధారణ ఎన్నికలు 2018 పోస్టర్ డిజైన్ తయారీపై డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఓటుపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల పోస్టర్ డిజైన్ రెండు అంశాలపై తయారు చేయాలని సూచించారు. ఇందులో మీరు ఓటు వేయండి - ఓటు వేయడం మీ హక్కు, బాధ్యత. ప్రలోభాలకు లొంగకుండా నైతికతతో ఓటు వేయాలని అంశాలపై ఎ-3, ఎ-2 సైజులో పోస్టర్ డిజైన్ చేసి ఈ నెల 28 లోగా మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనుటకు అన్ని కళాశాలల విద్యార్థులు అర్హులేనన్నారు. కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు వారి ఎంట్రీలతో పేరు, సంప్రదించు సెల్ నంబర్, ఈమెయిల్, కళాశాల పేరు పూర్తి వివరాలతో సూచించాలన్నారు. పోటీలలో గెలుపొందిన కళాశాల విద్యార్థులకు మూడు రకాల బహుమతులు ప్రధానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో ప్రథమ బహుమతి ఐదు వేలు, ద్వితీయ బహుమతి మూడు వేలు, తృతీయ బహుమతి రెండు వేల చొప్పున అందజేయనున్నట్లు వెల్లడించారు. గెలుపొందిన పోస్టర్లను ఎన్నికల అవగాహన కార్యక్రమంలో వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా మార్కెటింగ్ అధికారిని సంప్రదించాలని ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ సూచించారు.