కరీంనగర్

కూటమి కుట్రలను.. తిప్పికొట్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, నవంబర్ 14: స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఆరున్నర దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంత అభివృద్ధి టీఆర్‌ఎస్ హయాంలో తరిమికొట్టామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేంధర్,జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో కలిసి సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం నాలుగున్నరేళ్లలో అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. రూ. 1244 కోట్లతో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికిపాటుపడ్డామన్నారు.గతంలో ఎన్నడు కనివినీ ఎరుగని రీతిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుపర్చి చేసి చూపించాం గనుకనే అదే హక్కుతో ఓట్లు అడుగడానికి వచ్చామన్నారు. ముఖ్యమంత్రి ముద్దుల కూతురు అని తనను సంభోదిస్తున్నారని, ఒక్క ముఖ్యమంత్రి ముద్దుల కూతురినే కాదని రాష్ట్ర అడపడుచులందరి ముద్దుల కూతురినని అన్నారు. ప్రభుత్వం అమలుపరిచిన సంక్షేమ పథకాలతో పాటు జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కేటాయించిన నిధుల వివరాలను ప్రజలకు వివరించారు.నాలుగున్నర సంవత్సరాల పరిపాలన దక్షతతో ప్రగతి సాధించామని కూటమి కుట్రలు తిప్పికొట్టి గులాబీ జెండాకు అండగా నిలిచి సంజయ్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.మంత్రి ఈటల రాజేంధర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉచితంగా 24గంటల విద్యుత్తు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.

సంక్షేమంలో ప్రగతి
- మంత్రి ఈటల రాజేందర్
ధర్మపురి, నవంబర్ 14: అసమానతలకు, అన్యాయానికి అడుగడుగునా గురైన తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సాధించకున్న ప్రత్యేక రాష్ట్రంలో తెరాస తొలి ప్రభుత్వం సంక్షేమ రంగాలలో సాధించిన ప్రగతి సాటిలేనిదని అపద్ధర్మ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం ధర్మపురి క్షేత్రంలో తాజామాజీ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా కనీ వినీ ఎరగని రీతిలో సమీకరించ బడిన వేలాది మందిని ఉద్దేశించి రాజేందర్ ప్రసంగిస్తూ, దేశంలో కేసిఆర్ ఆదర్శ సిఎంగా కలకాలం నిలిచి పోయే పనులు చేపట్టారని, ఇతర రాష్ట్రాలకు పథకాల అమలులో ఆదర్శంగా నిలిచి ఉన్నారన్నారు. పంట నష్టానికి రైతు మృతి చెందితే 5వేలు కూడా నూచుకోని స్థితిని దాటి నేడు తక్షణ సాయంగా 5లక్షల బీమా పథకం వర్తిస్తుండడం, ఎకరానికి 6వేల పెట్టుబడి సాయం, నిరుపేదలకు వివాహాలకు లక్షసాయం, లక్షలాది మందికి పెన్షన్లు, లక్షలాది ఎకరాలకు సాగునీరు, అలాగే త్రాగునీరు అందిస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి అగిపోకుండా కొనసాగాలంటే కేసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం తిరిగి రావాలన్నదే యావత్ తెలంగాణ ప్రజల మనోభీష్ఠమన్నారు. ఈశ్వర్ ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ ఇతోధిక అభివృద్ధి చేశారన్నారు. ఈశ్వర్ తమ ప్రసంగంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, సాధించిన ప్రగతిని వివరించి, మరోసారి దీవించాలని కోరారు. ఆరు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పదాధికారులు, నాయకులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు.