కరీంనగర్

ఆరు నెలలకే మూలకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, మే 4: ప్రయాణీకుల దాహర్తి తీర్చడంతో పాటు స్వచ్ఛమైన నీటిని అందించాలన్న సంకల్పంతో పెద్దపెల్లి ఎంపి బాల్క సుమన్ గోదావరిఖని బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన నీటి శుద్ధియంత్రం మూలకు పడింది. ప్రారంభించి 6 నెలలే అవుతున్నా... అదికాస్త పట్టుమని 2 నెలలు కూడా పని చేయలేదు. ఎంపి నిధుల నుండి సుమారు రూ.8లక్షల రూపాయలను వెచ్చించి సంపూర్ణ స్థాయిలో నీటిని శుద్ధి చేసి రూ.1కే లీటర్ నీటిని అందించేందుకు ఇక్కడి బస్టాండ్‌లో నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రయాణీకులంతా హర్షించారు. కానీ ఆ సంతోషం రెండు మాసాలకే పరిమితమైంది. ఆ నీటి శుద్ధి యంత్రంలోని మిషినరీ చెడిపోతే కనీసం దాన్ని బాగు చేసే దిక్కుకూడలేదు. లక్షలు వెచ్చించి ఏర్పాటైతే చేశారు కానీ, దాని ఆలనా, పాలనా చూసే పర్యవేక్షకులు లేరు. నీటి శుద్ధి యంత్రం పాడైపోయ ఇంతకాలం అవుతున్నా... ఎవ్వరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. రూపాయికే స్వచ్ఛమైన లీటర్ నీళ్లు వస్తాయని సంబరపడ్డ ప్రయాణీకులు ఇది యంత్రం రిపేర్ కారణంగా అధిక ధరలకు బయట నీటిని కొనుక్కుంటున్నారు.