కరీంనగర్

పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని/పెద్దపల్లి, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమయ్యాక రెండవ సారి జరిగిన శాసన సభ ఎన్నికలు శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజక వర్గాల్లో ఉదయం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభమయ్యింది. నియోజక వర్గాలంతటా భారీ పోలీసు బలగాల పహారా, నిఘా కెమరాల మధ్య ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతం వాతావరణంలో నిర్వహించారు. జిల్లాలోని పెద్దపల్లిలో 2,21,919 ఓట్లుండగా రామగుండంలో 1,89,092 ఓట్లున్నాయి. అదేవిధంగా మంథనిలో 2,06,715 ఓటున్నాయి. సాయంత్రం 5గంటలోపు వరకు పెద్దపల్లిలో 59శాతం, రామగుండంలో 64శాతం, మంథనిలో 65శాతం పోలింగ్ నమోదయిన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. జిల్లాలో జరుగుతున్న శాసన సభ ఎన్నికల నిర్వహణపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ, పెద్దపల్లి డిసిపి సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో పర్యవేక్షించారు. రామగుండం నియోజక వర్గంలోని గోదావరిఖని పట్టణంలో పలు చోట్ల ఇవిఎంలు మొరాయించడంతో పోలింగ్ నిర్వహణకు ఆలస్యం జరిగింది. చాలా మంది తమ పనులకు వెళ్లే వారు ఉదయానే్న పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడంతో బారులు తీరాల్సి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సుమారు 3గంటల వరకు ఎన్నిక మంద కోడిగా కొనసాగిన చివరి సమయంలో మళ్లీ ఓటింగ్ పుంజుకుంది. జిల్లా కలెక్టర్ దేవసేన గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా గోదావరిఖనిలో తాజా మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్, టిఆర్‌ఎస్ అభ్యర్థి సొమారపు సత్యనారాయణ, కూటమి అభ్యర్థి మక్కాన్ సింగ్, బిజెపి అభ్యర్థి బల్మూరి వనిత, బిఎస్‌పి అభ్యర్థి మేరుగు శంకర్, ఇది ఇలా ఉండగా పెద్దపల్లిలో టి ఆర్ అభ్యర్థి మనోహర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి గుజ్జుల రామక్రిష్ణా రెడ్డి, సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణా రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని శాంతి నగర్‌లో, కొత్తపల్లిలో ఇవి ఎంలు మొరాయించగా పోలింగ్ ఆలస్యమైంది. గోదావరిఖనిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలల్లో వెల్తురు సక్రమంగా లేక ఇవి ఎంలలో గుర్తులు కనబడటం లేదని ఫిర్యాదుతో లైట్లను అమర్చారు. మంథని నియోజక వర్గంలోని మల్లెపల్లిలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా మంథని అభ్యర్థి పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువా కప్పుకొని వెళ్లడంతో కేసు నమోదయ్యింది. జిల్లా వ్యాప్తంగా 196 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుండగా అక్కడ పోలీసు బందోబస్తును మరింతగా పెంచి నిఘా పెట్టారు. ఎట్టకేళకు ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అటు ఎన్నికల శాఖ, ఇటు పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుంది.