కరీంనగర్

2014 తారుమారా.. పునరావృతమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 10: ఉమ్మడి జిల్లాలో ఎంతో ఉత్కంఠను రేపిన ముందస్తు ఎన్నికలు ముగిసి, మరి కొద్దిసేపట్లో ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రెండు మాసాలుగా ఓటరు దేవుడి ప్రాపకం కోసం అభ్యర్థులు, ఆయా పార్టీలు పరితపిస్తే, ఈనెల 7న తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ, ఈవి ఎం మెషిన్లలో అభ్యర్థుల భవితవ్యాన్ని భద్రపరిచాడు. వారి భవిష్యత్‌ను తేల్చే రోజు రానే రావటంతోఫలితాలపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సానుభూతి మద్య జరిగిన ఎన్నికల పోరు ఆదినుంచి హోరాహోరీగా జరిగింది. దీనికితోడు అధికారపార్టీ సిటింగ్ అభ్యర్థులకే టికెట్లు కేటాయించగా, ప్రత్యర్థుల జోరుతో ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో పోటీ నువ్వా..నేనా అన్నట్లు కొనసాగింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రజాకూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపుతున్నట్లు పరిస్థితులు కనిపించాయి. ఇటు అధికార పార్టీ, అటు అధికార అభ్యర్థులపై నెలకొన్న అసంతృప్తి, వ్యతిరేకంగా మారుతుందనే భావన అన్ని వర్గాల్లో నెలకొనగా, అయితే, అనుకున్నదొకటి..పోలింగ్ రోజు వరకు జరిగింది మరోటి అన్నట్లుగా మారటంతో, తాజాగా వెలువడబోయే ఫలితాలపై రాష్టవ్య్రాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి అంకురార్పణ చేసిన ఉద్యమ జిల్లా కరీంనగర్‌లో అధిక సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటు, నిలకడగా పాలన సాధ్యమవుతుందనే భావన అన్ని పార్టీల్లో నెలకొంది. ఇందుకు అనుగుణంగా ఆయా పార్టీల విశే్లషణ కూడా జరుగుతోంది. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోతాము గెలవబోయే సీట్లు, ప్రత్యర్థులు రాబట్టుకునే స్థానాలు, స్వతంత్రుల హవాపై అంచనాలు వేస్తున్నాయి. వీటికి తగ్గట్లు కొత్త ఓటర్ల ప్రభావం, అలాగే అతివల ఆదరణ ఎవరిపట్ల ఉందోననే ఆందోళన కూడా అన్ని పార్టీల్లో కొనసాగుతుంది. దీంతో ఆదిలో అధికారంలోకి వస్తామనే భరోసా క్రమంగా తగ్గుతూ, అసలు గెలుపోటములపైనే స్పష్టమైన అవగాహనకు రాలేకపోతుండగా, గతంలో తాము వేసుకున్న అంచనాలు తిరగబడుతున్నట్లు అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. అయినా, గెలుపుబావుటాపై ఎవరి ధీమా వారిదేనన్నట్లుగా సాగుతుంది. కార్యకర్తల్లో సైతం అనుకూల ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతమయ్యేనా..తిరగబడేనా? అనే చర్చ రాజకీయ విశే్లషకుల్లో కొనసాగుతుంది. కాగా, మరికొద్ది గంటల్లో జయాపజయాలపై స్పష్టమైన క్లారిటీ రాబోతుంది.