కరీంనగర్

నేడు ఓట్ల లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 10: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 11న మంగళవారం జరుగనున్న సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సోమవారం ఈ మేరకు విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు మంగళవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించుటకు జిల్లా ఎన్నికల అధికారులకు ఇచ్చిన అధికారాల మేరకు కౌంటింగ్ రోజైన 11న మంగళవారం సెలవుదినంగా కరీంనగర్ పట్టణంలో సెలవు ప్రకటించినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయాలు యదావిధిగా పనిచేస్తాయని ఆ ప్రకటనలో జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు.