కరీంనగర్

ప్రజాకూటమికి అధికారం.. పగటికల మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 10: రాష్ట్రంలో ప్రజాకూటమి అధికారం చేపట్టడం పగటి కల మాత్రమేనని మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సోమవారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరీంనగర్‌లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్లేనని, ఓటమి భయంతోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. అభ్యంతరకరమైన భాషనుపయోగించి, మాజీ ఎమ్మెల్యేపై చిందులేయటం ఆయన అసహనానికి నిదర్శనమన్నారు. నగరంలో కొనసాగుతున్న రహదారుల నిర్మాణంలో బల్ధియా ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇచ్చిన నివేదికననుసరించి, నాణ్యతలోపంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కార్పోరేటర్లు, తనకు మద్య అభిప్రాయబేధాలు సృష్టించి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపేయత్నంలో భాగంగానే తన ఫిర్యాదును వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తూ నగరంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయజూసాడని, పోలింగ్ రోజు కార్ఖానగడ్డలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. సంఘటన స్థలంలోనే ఉండి లాఠీచార్జీ చేయించిన వ్యక్తే, తమపై ఆరోపణలు చేయటం గర్హనీయమన్నారు. గెలుపుకోసం ఎంతటి నీచానికి దిగినా, తుదకు తమదేనని ఆయన స్పష్టం చేశారు. ఈసమావేశంలో కార్పోరేటర్ సునీల్‌రావు, తెరాస నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కర్రె లింగయ్య, నేతికుంట యాదయ్య, గూడూరి మురళి, మైకేల్ శ్రీను, పలువురు పాల్గొన్నారు.