కరీంనగర్

నేడు 144వ సెక్షన్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 10: అసెంబ్లీ ఎన్నికల చివరి అంకమైన ఓట్ల లెక్కింపులో భాగంగా నేడు జిల్లావ్యాప్తంగా 144వ సెక్షన్ అమల్లోకి తెచ్చినట్లు జిల్లా పోలీసు యంత్రాంగం తెలిపింది. ఉదయం 8గంటల నుంచి బుధవారం ఉదయం వరకు 24గంటల పాటు అమల్లో ఉంటుందని, ఈసందర్భంగా ప్రజలు గుంపులు, గుంపులుగా తిరగరాదని, ఐదుగురి కంటే అధికంగా ఉండరాదని,నిర్దేశించిన మేరకు మాత్రమే టపాకాయలు కాల్చాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అలాగే, మద్యం దుకాణాలు కూడా 24గంటల పాటు మూసివేయాలని, బార్లు, మిలటరీ క్యాంటీన్లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. అనుమతుల్లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు జరిపినా చర్యలు తీసుకుంటామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.