కరీంనగర్

కరినారంలో గులాబీ ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 11: ఉద్యమాల పురిటి గడ్డ..రాజకీయ చైతన్య ప్రతీక అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రత్యేక పోరులో చేపట్టిన ఉద్యమ హోరును గుర్తుచేస్తూ, అప్రతిహ విజయ పరంపరను కొనసాగించింది. జిల్లావ్యాప్తంగా నిరాటంకంగా కొనసాగిన కారు జోరుతో ప్రత్యర్థులు బేజారు కాగా, అన్నీ తానై విజయం కోసం అధినేత పన్నిన వ్యూహం ఫలించింది. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలతో చేపట్టిన హోరాహోరీ పోరులో తెరాస ముందంజలో ఉండగా, మొత్తం 13 స్థానాలకు గాను 11చోట్ల విజయబావుటా ఎగరేసి, తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. 2014లో 12స్థానాల్లో గెలుపొంది, ఒకటి మాత్రమే కోల్పోగా, ఈసారి మాత్రం రెండు సీట్లు కోల్పోయింది. అయినా, గతంలో కంటే అధికంగా ఓట్లు రాబట్టుకుని, పెరిగిన ఓటింగ్ శాతాన్ని తనకు అనుకూలంగా మల్చుకోవటం గమనార్హం. కాగా, ఉమ్మడి జిల్లానుంచి ప్రాతినిత్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు తమ స్థానాల్లో గెలుపొందగా, మంథని నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పుట్టమధు ఓటమి చెందగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీ్ధర్‌బాబుకు 88,858 ఓట్లు రాగా, 16,222 ఓట్లతో గెలుపొందారు. జగిత్యాల నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన డా.సంజయ్‌కుమార్ ఈసారి అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించగా, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి 43,062 ఓట్లు రాగా, 61,175 ఓట్లతో ఓటమి చవి చూశారు. చొప్పదండి నుంచి బొడిగె శోభ స్థానంలో ప్రమోట్ అయిన ఆపార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌కు 90,965 ఓట్లు రాగా, 48,716 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. హుస్నాబాద్‌లో వొడితెల సతీష్‌కుమార్‌కు 1,17, 083 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి చాడ వెంకటరెడ్డిపై 70,530 ఓట్లతో గెలుపొందారు. మానకొండూర్‌లో సిటింగ్ ఎమ్మెల్యే ఏల్పుల బాలకిషన్‌కు 88,890 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి,సమీప ప్రత్యర్థి ఆరెపల్లి మోహన్‌పై 31,681 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వేములవాడలో చెన్నమనేని రమేశ్‌బాబుకు 84,050 ఓట్లు రాగా, దీర్ఘకాల ప్రత్యర్థి ఆది శ్రీనివాస్‌పై 28,186 ఓట్లతో గెలుపొందారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు 84,137 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగారావుపై 30,901 ఓట్ల మెజారిటీ లభించింది. ధర్మపురి నుంచి బరిలోకి దిగిన తెరాస మాజీ విప్ కొప్పుల ఈశ్వర్‌కు 69,617 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌పై 441 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో నెగ్గటంతో, చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డికి 80, 616 ఓట్లు పోలవగా, తన సమీప ప్రత్యర్థి చింతకుంట విజయరమణారావుపై 8,234 ఓట్లతో గెలిచారు. రామగుండం లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దిగిన తెరాస తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్‌కు 60,444 ఓట్లు రాగా తన సమీప ప్రత్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు 34,354 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్‌కు 1,03,393 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి 43,401 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో మంత్రి కేటీ ఆర్‌కు 1,25,213 ఓట్లు పోలవగా, తన సమీప ప్రత్యర్థి కెకె మహేందర్‌రెడ్డి 89,009 ఓట్ల తేడాతో పరాజయం పొందారు.కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌కు 80,083 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు 66,009 ఓట్లు పోలయ్యాయి. 14,974 ఓట్లతేడాతో అపజయం పాలయ్యారు.