కరీంనగర్

ఈటల విజయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజురాబాద్/జమ్మికుంట, డిసెంబర్ 11: హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ టిఅర్ ఎస్ పార్టీ నుండి డబుల్ హాట్రిక్ సాధించి విజయకేతనం ఎగురవేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నికల్లోకి తొలి సారిగా వచ్చిన అనాటి కమాలపూర్ నియోజవర్గంలో టిఅర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలుపోంది, ఎదురులేకుండా హుజురాబాద్ నియోజవర్గంగా మారిన క్రమంలోసైతం వరుసగా అరోవసారి అఖండ విజయం సాధిస్తు హుజురాబాద్ నియోజకవర్గం చరిత్ర తిరుగరాశారు. 2004నుండి 2018 వరుకు వరుస విజయాలతో విజయదుంభింబి మోగించారు. కాంగ్రేస్ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీప బంధువు కావడంతో పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రేస్ అభ్యర్థిగా టికెట్ సాధించి ఎన్నికల్లో తొలిసారిగా కౌశిక్ నిలిచారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి మంత్రి ఈటల రాజేందర్‌కు గట్టి పోటి ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈటల రాజేందర్‌కు 1,04840 ఓట్లు రాగా,పాడి కౌశిక్‌రెడ్డికి 61121 వేల ఓట్లు వచ్చాయి. ఈటలకు 43865 ఓట్ల మోజార్టితో ఈటల రాజేందర్ గెలుపోందారు. టిఅర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ,అభివృద్ది పనులు,ప్రజలను అకట్టుకున్నాయని, ప్రజలు గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా రైతు బంధు పథకం హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు. దింతోపాటు రైతు బుంధు,రైతుభీమా పథకం ,సాదిముబారక్ ,కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు పూర్తి ప్రజలు విశ్వసించారు. టిఅర్ ఎస్ ప్రజలు పట్టకట్టారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని పట్టణాలు,గ్రామాలలో ఈటల గెలుపును అస్వాధిస్తు, బానసంచా కాల్చి,స్వీట్లు పంపిణి చేసుకోని సంబారాలు జరుపుకున్నారు.
మరోసారి మంత్రి పదవి దక్కనుంది
ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధన విశేష కృషి చేసిన ఈటల రాజేందర్‌కు కెసిఅర్ మంత్రి వర్గంలో కీలక పదవి దక్కునుందని పలువురు బావిస్తున్నారు. బిసి అగ్రనేతగా కెసిఅర్‌కు అత్యంత సన్నిహితునిగా పేరు సంపాదించుకున్న ఈటల రాజేందర్ మరోసారి మంత్రి పదవి కాయంగా దక్కనుందని కార్యకర్తలు,నాయకులు బావిస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలకు రుణ పడి ఉంటా.. ఈటల
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఉద్యమ కాలం నుండి సహకరిస్తు, నన్ను గెలిపించుకుంటున్న ప్రజలకు ఎల్లవేల అందుబాటులో ఉంటు,ప్రజల అకాంక్షలకు అనుగుణంగా సేవ చేస్తానని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ర్యాలీలో మజ్లిస్ కవ్వింపు చర్యలు
బండి సంజయ్ ఇంటి ఎదుట
ఎంఐఎం జెండాలతో నినాదాలు
రాళ్ళు రువ్వుకున్న ఇరు వర్గాలు
సంఘటనా స్థలికి చేరుకున్న సీపీ
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 11: అసలే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ, ఆపై కొంతమంది మజ్లిస్ కార్యకర్తల ఆకతాయి పనులతో మంగళవారం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం తెరాస అభ్యర్థి గంగుల కమలాకర్ నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ లెక్కింపు కేంద్రం నుంచి కోర్టు వైపు వస్తుండగా, మద్యలో ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఇంటి ఎదుటకు ర్యాలీ రాగానే కొంతమంది ఎంఐఎం కార్యకర్తలు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ, బీజేపీ పార్టీని, బండి సంజయ్‌కుమార్‌ను దూషించారు. దీంతో అక్కడే ఉన్న ఆయన అభిమానులు, భాజపా కార్యకర్తలు ప్రతి నినాదాలు చేయగా, వారిపై ఎంఐఎం కార్యకర్తలు రాళ్ళు, చెప్పులు విసిరారు. ఒక్కసారిగా జరిగిన ఈసంఘటనతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియక రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎంఐఎం రాళ్ళదాడిలో పలువురు బాటసారులకు గాయాలయ్యాయి. పరిస్థితులు విషమిస్తూ, ఉద్రిక్తంగా మారే సూచనలు కన్పిస్తుండగా, పోలీసులకు సమాచారమందించారు. వెంటనే సిపి విబి కమలాసన్‌రెడ్డి అక్కడికి చేరుకుని, మజ్లిస్ కార్యకర్తలను చెదరగొట్టి, పరిస్థితులు అదుపులోకి తెచ్చారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తామని సిపి తెలిపారు.
టీఆర్‌ఎస్ గెలిస్తే మజ్లిస్ సంబరాలా..?
లోపాయికారి ఓట్ల బదిలీ ఒప్పందాలతో ఎంఐఎం పార్టీ నేతలు, ఓవైసీ సోదరులు కరీంనగర్‌లో బీజేపీని ఓడించేందుకు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, మజ్లిస్ కుట్రలకు కరీంనగర్ బలికాబోతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ గెలిస్తే ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారని, పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలపై , అయ్యప్ప మాల ధారణ స్వాములు, సామాన్య ప్రజానీకంపై రాళ్ళదాడులు చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. హైద్రాబాద్ లాంటి రాజకీయ వాతావరణాన్ని నగరంలో నెలకొల్పి అసాంఘీక కార్యక్రమాలకు ఎంఐఎం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. నగర ప్రజలు సంఘటితశక్తిగా మారుతున్నారనే భయంతోనే ఓవైసీ సోదరులు ప్రత్యేక శ్రద్ధతోటీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ముస్లీం మైనార్టీలను ప్రలోభాలకు గురిచేసి, పోలింగ్ రోజున గొడవలు సృష్టించారని ఆరోపించారు. మజ్లిస్ ఆగడాలు సృష్టించకముందే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, మజ్లిస్ పార్టీ బారి నుంచి కాపాడుకునేందుకు సంఘటిత శక్తిగా నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.
కొప్పుల ఈశ్వర్ డబుల్ హ్యాట్రిక్
ధర్మపురి, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన మూడవ సాధారణ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం జగిత్యాల జల్లా కేంద్రంలో జరిపిన ఓట్ల లెక్కింపులో ధర్మపురి నియోజకవర్గంనుండి ఎన్నికలలో తాజామాజీ చీఫ్‌విప్, ధర్మపురి సిట్టింగ్ శాసనసభ్యులు, టిఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. అయితే ఈసారి అత్యల్ప మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఆద్యంతం పోటాపోటీగా, ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై ఈశ్వర్ కేవలం 441 ఓట్ల తేడాతో గట్టెక్కారు. తిరిగి ఈశ్వర్ ధర్మపురి శాసనసభ్యునిగా నిలిచారు. 14రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 70,579 ఓట్లను సాధించి, 70,138 ఓట్లను పొందిన తన సమీప ప్రత్యర్థి లక్ష్మణ్ కుమార్‌పై కేవలం 441 ఓట్ల అత్యల్ప తేడాతో శాసనసభకు ఎన్నికైనారు. తద్వారా కొప్పుల ఈశ్వర్ ముచ్చటగా ఆరవ సారి వరుస విజయాలను నమోదు చేసుకుని, ఓటమినెరుగని నేతగా నిలిచారు. ఈ ఎన్నికలలో అనూహ్యంగా ట్రక్కు గుర్తును పొందిన స్వతంత్ర అభ్యర్థి కుంటాల నర్సయ్య 13,114 ఓట్లు పొంది మూడవస్థానంలో నిలవగా, జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్యకు 5,272 ఓట్లు మాత్రమే రావడం విశేషం. తత్ఫలితంగా ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంనుండి మూడవ సాధారణ ఎన్నికలో పోటీపడి, తెరాస అభ్యర్థిత్వంపై శాసన సభ్యునిగా తిరిగి ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ సాధించడమే కాకుండా, చరిత్రను తిరగ రాశారు. అంతేకాక బుగ్గారంలో రత్నాకర్‌రావుకు తప్ప వరుస విజయాలకు ఊతమివ్వని నేపథ్యంలో, గతంలో మేడారం శాసనసభ్యునిగా ఉంటూ, రెండు సార్లు గెలిచి, నియోజకవర్గాల పుర్విభజనలో భాగంగా ధర్మపురి నూతన నియోజకవర్గంలో, ప్రప్రథమ ఎమ్మెల్యేగా ఎన్నికై, రాజీనామా చేసి, ఉప ఎన్నికలో గెలిచి, గత సాధారణ ఎన్నికలో, ప్రస్తుతం సాధారణ ఎన్నికలలో జయకేతనం ఎగురవేసి, వరుస విజయాన్ని నమోదు చేసుకుని, ఓటమి నెరుగక అంటే ఆరు సార్లు శాసనసభకు వరుసగా పోటీచేసి, ప్రాతినిథ్యం వహించే అవకాశం పొంది, అనవాయితీని మార్చి రికార్డు సృష్టించారు. తాజామాజీ చీఫ్‌విప్, ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వర్ విజయం నల్లేరుపై నడక కాక పోగా, చివరి వరకూ ఉత్కం భరితంగా సాగగా,. అనూహ్యంగా అడ్లూరి గట్టిపోటీ ఇచ్చి, నువ్వా?నేనా అంటూ సవాలు చేయగా, చివరకు స్వల్ప అధిక్యతతోనైనా విజయాన్ని సాధించడంతో, మంగళవారం కరీంనగర్‌కు తరలి వెళ్ళిన ఆయన అభిమానులు, అభినందనల వెల్లువలో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కృతఙ్ఞతలు తెలియజేశారు.
ప్రజా విశ్వాసాన్ని వమ్ముచేయను
- ధర్మపురి ఎమ్మెల్యే ఈశ్వర్
ధర్మపురి, డిసెంబర్ 11: ధర్మపురి శాసనసభా స్థానానికి తనను నాలుగవ సారి వరుసగా గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయక వారి అభీష్ఠానికి అనుగుణంగా పనిచేయగలనని మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడి, విజయం సాధించిన సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయి, విజయుడుగా ఈశ్వర్ ప్రకటింపబడిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటానని, ఈవిషయంలో తాను రాజీ పడే ప్రసక్తే లేదని నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పడిన తమ పార్టీ నవ తెలంగాణ పునర్మిర్మాణ లక్ష్య సాధనకు పునరంకితం కాగలమని, కేసిఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్భ్రావృద్ధి తప్పక జరగగలదని ధీమా వ్యక్తం చేశారు.
తనకు మద్దతు తెలిపి, విజయానికి కలిసి కట్టుగా కృషి చేసిన టిఆర్‌ఎస్, కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానన్నారు. ప్రజా సమస్యలపై తాను ఎల్ల వేళలా పోరాడుతానని, రైతులు, కార్మిక, కర్షక, ఉద్యోగ ఒక్కరేమిటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి నిరంతరం శ్రమించి, కృషి చేయగలనని హామీ ఇచ్చారు. తమపార్టీ లక్ష్యాన్ని తు.చ.తప్పకుండా అమలు జరిపే కృషి సల్పడం విషయంలో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన పనిలేదన్నారు.

‘దాసరి’ గెలుపుతో తెరాస శ్రేణుల్లో జోష్
పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 11: మండలంలోని కాసులపల్లి గ్రామానికి చెందిన దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి శాసన సభ్యులుగా రెండవ సారి విజయ సాధించారు. తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన దాసరి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న విజయరమణారావుపై ఎనిమిది వేల పైచీలుకు ఓట్లతో గెలుపొందారు. దాసరి మనోహర్ రెడ్డి గెలుపుతో గ్రామాల్లో సంబరాలు జరుపుకున్నారు. తెరాస శ్రేణులు టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంపిణీ చేస్తూ హంగమా సృష్టించారు. కాంగ్రెస్, తెరాసల మధ్య నువ్వా, నేనా అనే రీతిలో సాగిన ఎన్నికలలో దాసరి గెలుపొందడంతో తెరాస శ్రేణుల్లో కొత్త జోష్ సంతరించుకున్నది. విద్యా సంస్థల అధినేతగా ఉన్న దాసరి తెలంగాణ ఉద్యమ కాలంలో తెరాస పార్టీలో చేరారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరిగిన శాసన సభ ఎన్నికలలో తెరాస పార్టీ నుంచి పెద్దపల్లి శాసన సభకు పోటీ చేసిన దాసరి కాంగ్రెస్ అభ్యర్థి భానుప్రసాదరావుపై ఘన విజయం సాధించారు. పెద్దపల్లి శాసన సభకు జరిగిన ఎన్నికలలో వరసగా రెండవ సారి గెలుపొందిన వారిలో దాసరి రెండవ వారు కావడం విశేషం.
రీకౌంటింగ్‌కు అడ్లూరి డిమాండ్
ధర్మపురి, డిసెంబర్ 11: మంగళవారం నాటి ధర్మపురి శాసనసభ ఎన్నికల లెక్కింపులో కొప్పుల ఈశ్వర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ల మధ్య అత్యంత తక్కువ ఓట్ల తేడా చోటు చేసుకుంది. కమ్మర్‌ఖాన్‌పేట, కొండాపూర్, తిమ్మాపూర్, దమ్మన్నపేట గ్రామాల సంబంధిత ఈవీఎంలలో లెక్కింపుకు యాంత్రిక సమస్య ఉత్పన్నమైనన కారణంగా, కొంత జాప్యం జరగగా, వీవీప్యాట్స్ తెచ్చి, వాటిలోని ఓట్ల స్లిప్పులను లెక్కించారు. అయితే లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం తెలిపి, తిరిగి లెక్కించాలని డిమాండ్ చేయడంతో మళ్ళీ స్లిప్పులను లెక్కించి ఈశ్వర్ గెలుపొందినట్లు ప్రకటించారు. ఎన్నికల కేంప్రరిశీలకులు దుందుప్ షర్పా, జిల్లా ఎన్నికల ప్రాధికారి, కలెక్టర్ శరత్, జేసిల సమక్షంలో ఆర్‌ఓ ఈశ్వర్ గెలుపొందిన ధృవీకరణ పత్రాన్ని, ఎన్నికల ఏజెంట్ అయిన న్యాయవాదికి అందజేశారు.