కరీంనగర్

ప్రజలకు రుణపడి ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, డిసెంబర్ 14: తనను పెద్ద మనసుతో రెండవసారి ఆశీర్వదించి గెలిపించిన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ విజయం ప్రజల విజయమని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుండి భారీగా ద్విచక్ర వాహనాలతో టిఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి సుల్తానాబాద్ మండలానికి వచ్చిన మనోహర్ రెడ్డికి ప్రజలు, టిఆర్‌ఎస్ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. సుల్తానాబాద్‌లోని శాస్ర్తినగర్‌లో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుండి ర్యాలీగా వచ్చి తెలంగాణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి దాసరి మనోహర్ రెడ్డి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై నమ్మకంతో ప్రజలంతా తనను ఆశీర్వదించారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ, అన్ని రంగాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ సేవలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, ఎంపిపి పారుపెల్లి రాజేశ్వరి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కోట రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీ రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ డాక్టర్ అయిల రమేష్, నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ధీకొండ భూమేష్, పోచంపల్లి పోచమల్లు, అశోక్ రెడ్డి, గాజుల రాజమల్లు, కాంపెల్లి నారాయణ, ఆడెపు అంబదాసు, కోడెం అజయ్, పడాల అజయ్, పాల రామారావు, పారుపెల్లి గుణపతి, మెంగాని చంద్రశేఖర్, పసెడ్ల రవీందర్, కల్వల నారాయణ, గండి శ్రీనివాస్, బండి మల్లిఖార్జున్, సజయ్, ముత్యం రమేష్, ఉస్తెం రమేష్, క్యాదాసి సంజీవ్, గట్టు శ్రీనివాస్, తుమ్మ రాజ్ కుమార్, బొంగాని శ్రీనివాస్ గౌడ్, బైరగోని ప్రభాకర్ గౌడ్, మొల్గూరి అంజయ్య పాల్గొన్నారు.

ఖైదీలు సత్పరివర్తనతో మెలగాలి
విడుదలైన ఖైదీలకు రాష్ట్ర స్థాయిలో జాబ్‌మేళా
జైళ్ళ శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ మురళీ బాబు
జగిత్యాల, డిసెంబర్ 14: ఖైదీలు సత్ప్రరివర్తనతో మెలగాలని జైళ్ళ శాఖ వరంగల్ రేంజ్ డిఐజి మురళి బాబు అన్నారు. శుక్రవారం జగిత్యాల సబ్‌జైల్‌ను ఆకస్మీకంగా తనిఖి చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖైదీలు తయారు చేసిన వస్తువులను ప్రతి మండలంలో విక్రయించేందుకు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామని, జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 4 స్టాల్స్ ఏర్పాటు చేసామని అన్నారు. ఖైదీల్లో మార్పు తెచ్చెందుకు యోగా,వంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసామని , వైద్య చికిత్సలు అందిస్తున్నామని వెల్లడించారు. విడుదలైన ఖైదీలకు రాష్టస్త్రాయిలో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పెర్కొన్నారు. డిఐజి వెంట కరీంనగర్ జిల్లా డిఎస్‌జివో రతన్, జగిత్యాల సబ్‌జైల్ సూపరిండెంట్ శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు.

ప్రజాసంక్షేమానికి పట్టం
-కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 14: అనునిత్యం ప్రజాసంక్షేమానికోసమే పరితపించిన అధినేత కేసిఆర్‌పై అపారమైన నమ్మకంతోనే తెలంగాణ జనం రెండోసారి తెరాసకు పట్టం కట్టారని కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కేటిఆర్‌లను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల బాగుకోసం అనునిత్యం ఆలోచించే అధినేత కేసిఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గమనించి తెలంగాణ జనం రెండోసారి కేసిఆర్ కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించిన తెరాస అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును తెలంగాణ భవన్‌లో కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటిఆర్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఇదే స్పూర్తితో మరిన్ని విజయాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుతూ కేటిఆర్‌కు ఉమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా మరింత అంకితభావంతో పనిచేసే విధంగా ప్రజలు అపారమైన నమ్మకాన్ని తెరాసపై ఉంచడంతో రెట్టింపు ఉత్సాహం, బాధ్యతతో పనిచేయాలని అధినేత తెరాస ప్రజాప్రతినిధులను ఆదేశించిన నేపథ్యంలో ప్రజాసంక్షేమం కోసం సైనికుల్లా పనిచేసేందుకు ప్రజాప్రతినిధులందరం ముందుంటామని తుల ఉమ వెల్లడించారు.

ఇది ప్రజల విజయమే
అభివృద్ధే నా ఆశయం
కేటీఆర్‌తో పార్టీ మరింత బలోపేతం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల, డిసెంబర్ 14: నావిజయం ప్రజల విజయమేనని, జగిత్యాల ప్రాంతం అబివృద్దే నాలక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కౌండిన్య హల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకిశోరం మంత్రి కెటిఆర్ ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్‌గా నియమించినందుకు సిఎం కెసిఆర్‌కు దన్యవాదాలు తెలుపుచున్నానని పేర్కొన్నారు. కెటిఆర్‌తో టీఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. కెటిఆర్ సహకారంతో జగిత్యాల నియోజకవర్గంలో15కోట్లతో 4సంవత్సరాల్లో ఉపాధి హమీ ద్వారా సీసీ రోడ్లు, వైకుంఠదామాల నిర్మాణం జరిగాయన్నారు. నియోజకవర్గ అబివృద్ది,వ్యవసాయరంగ అబివృద్దికి కృషి చేస్తానని, త్రాగు నీటి కోసం ఇప్పటికి ఇబ్బందులు పడుతున్న గూడెంలు ఉన్నాయని, మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందిస్తామని అన్నారు. ఎంపి కవిత సహకారంతోపార్టీ బూత్ కమిటీలు వేయడంతో పార్టీ బలోపేతం అవడం జరిగిందని దీంతోనే బారీ మెజార్టీ వచ్చిందని అన్నారు.జగిత్యాల మున్సిపల్ పక్కకు జరిగితేనే అబివృద్ది జరుగుతుందని వెల్లడించారు. ఈసమావేశంలో పట్టణ , మండల, మైనార్టీ అద్యక్షులు గట్టు సతీష్, రౌత్ గంగాదర్, నక్కల రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్, ప్రభాత్ సింగ్, మాజీ కౌన్సిలర్ సమీండ్ల శ్రీనివాస్, జిల్లా టిఆర్‌ఎస్ యూత్ అద్యక్షుడు దావా సురేష్‌తదితరులుపాల్గొన్నారు.