కరీంనగర్

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 14: ప్రజా సంబంధాలు పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాల్సిన సోషల్ మీడియాను స్వార్ధపూరిత విధానాలకుపయోగిస్తూ, దుర్వినియోగం చేయటం సముచితం కాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు వేదికగా మాత్రమే వినియోగించుకోవాలని, సమాజంలో వైషమ్యాలు పెంచేలా, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా దుర్వినియోగం చేయటం నేరమని అన్నారు. కల్పిత విషయాలతో, ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడవద్దని, గ్రూపుల్లో ఇలాంటి విషయాలు షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్‌లపై సైబర్ చట్టాల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయటం జరుగుతుందన్నారు. విద్యార్థులు, యువకులపై కేసులు నమోదైతే, భవిష్యత్తులో ఉద్యోగాలకు అనర్హులవుతారని, ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలు, దేశాలకు వెళ్ళాలనుకునే వారికి పాస్‌పోర్టు, వీసా పొందేందుకు అనర్హులవుతారని ఆయన పేర్కొన్నారు. అనాలోచిత, అవాస్తవమైన విషయాలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని, గ్రూపుల్లో వివిధ వ్యక్తులు షేర్ చేసే విషయాలపై అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సిపి సూచించారు.

మత్సకార్మికుడి గల్లంతు
తిమ్మాపూర్, డిసెంబర్ 14: ఎల్‌ఎండి రిజర్వాయర్‌లో గురువారం వీచిన ఈదురు గాలులకు మండలంలోని అల్గునూర్ గ్రామశివారులోగల చేపల కాలనీకి చెందిన మత్సకార్మికుడు తిప్పరవేణి సత్తయ్య చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైనంట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని చేపల కాలనీకి చెందిన తిప్పరవేణి సత్తయ్య గురువారం ఉదయం చేపలు పట్టేందుకు డ్యామ్‌లోకి వెలుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. సత్తయ్య రాత్రి అయినప్పటికీ ఇంటి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా, బంధువుల వద్ద వన్నాడేమోనని తెలుసుకున్నారు. తోటి మత్సకార్మికులను అడిగితే ఈదురు గాలులకు గల్లంతై ఉండవచ్చని, తన తెప్పే మాత్రం అక్కడే ఉంది. తాను వేటకు వెళ్లినప్పుడు తెలుపు రంగు చొక్క, ఎరువు రంగు గీతల లుంగీ, మెడలో ఎరుపు రంగు రుమాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్‌ఎండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ రావు, ఎస్సై నరేశ్‌రెడ్డిలు తెలిపారు.

ఈసారైనా ఈశ్వర్ మంత్రి అయ్యేనా?
ధర్మపురి, డిసెంబర్ 14: తెరాస సీనియర్ నేత, రాజకీయ విధాన నిర్ణయ కమిటీ సభ్యులు, తాజామాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, ధర్మపురి సిట్టింగ్ శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్‌కు ఆసారైనా మంత్రి పదవి దక్కేనా? అన్న చర్చ జరుగుతోంది. జూలపెల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో 1959 ఏప్రిల్ 20న కొప్పుల లింగయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించిన ఈశ్వర్ బి.ఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సింగరేణి కార్మిక నాయకుడిగా గుర్తింపు పొంది, మొదటిసారిగా 1994లో మేడారం నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి స్పల్ప తేడాతో ఓటమి పాలైనారు. తెరాస అధినేత కేసిఆర్ స్వయంగా ఆహ్వానించిన సందర్భంగా తన బాట ఉద్యమ బాటేయని తలంచి, తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా ఉద్యమాలకు నాయకత్వం వహించి, 2004లో మేడారం నుండి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. కేసిఆర్ సూచనపై ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించి, 2007లో తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు. మేడారం నియోజకవర్గం కనుమరుగై, తాను ప్రాతినిథ్య, వహించిన గ్రామాలు చేర్చబడిన నూతన ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం నుండి 2009 ఎన్నికలలో టిఆర్‌ఎస్ పక్షాన పోటీ చేసి, విజయ లక్ష్మిని వరించారు. అలాగే కేసిఆర్ ఆదేశానుసారం మళ్ళీ తన పదవికి రాజీనామా చేసి, 2010లో తిరిగి పోటీ చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2014 రెండవసాధారణ ఎన్నికలలో తెరాస పక్షాన పోటీచేసి, ధర్మపురి నుండి మూడవ సారి, వరుసగా గెలుపొంది, కేసిఆర్ ప్రదిపాదిత స్పీకర్ పదవికి మొగ్గు చూపక, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత మూడవ సాధారణ ఎన్నికలలో పోటీ చేసి, ఆరవ సారి జయకేతనం ఎగురవేసి విజయుడై, డబుల్ హ్యాట్రిక్ సాధించి వరుస విజయాలతో రికార్డు నెలకొల్పారు. పార్టీలో సీనియర్‌గా, సౌమ్యునిగా, కేసిఆర్‌కు అత్యంత విశ్వసనీయునిగా, అంతకు మించి వీర విధేయునిగా ఉన్న, అత్యంత విశ్వాస పాతృడైన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి తప్పక మంత్రి పదవి రానున్నదనే చర్చ జోరుగా సాగుతోంది.

నేతన్న విగ్రహంకై భూమి పూజ
చొప్పదండి, డిసెంబర్ 14: పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఫౌంటేన్ స్థలంలో శుక్రవారం నేతన్న విగ్రహం ఏర్పాటుకై నేతన్నలు భూమి పూజ నిర్వహించారు. ఈ మేరకు గత కొంత కాలంగా ఫౌంటేన్ కొనసాగక నిర్వీర్యంగా ఉంటుంది. అయితే పట్టణంలో పద్మశాలీలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో నేతన్న విగ్రహం ఏర్పాటుకై ఇదే స్థలంలో నేతన్న విగ్రహ ఏర్పాటుకై భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు సామల రాజన్న, గౌరవ అధ్యక్షుడు దండె రాజయ్య, మండల అధ్యక్షుడు గ్యాజంగి రాములు, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, జడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, కరీంనగర్ ఎంపిపి వాసాల రమేష్, ఎంపిటిసి ఎలిగేటి తిరుపతి, మాజీ ఎంపిపి వల్లాల క్రిష్ణహరి, గడ్డం వెంకటేశం, ఎన్నం మునీందర్, అనుమల్ల నర్సయ్య, వలస భద్రయ్య పాల్గొన్నారు.

అవినీతి కేసులో మహిళకు జైలుశిక్ష
కరీంనగర్ (లీగల్), డిసెంబర్ 14: రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న స్వర్ణలత లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో కరీంనగర్ ప్రత్యేక ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు సంవత్సరం జైలుశిక్ష విధించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సిద్ధపల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతి రాజుగౌడ్ తండ్రి ఆర్టీసిలో డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోయాడు. దీనికి సంబంధించి లీగల్ ఏయిర్ సర్ట్ఫికేట్ కోసం డిచ్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తహశీల్దార్ సూచన మేరకు ఆయా సర్ట్ఫికేట్లు పొందుటకు జూనియర్ అసిస్టెంటుగా ఉన్న స్వర్ణలతను కలువమని కోరారు. తహశీల్దార్ సూచన మేరకు స్వర్ణలతను కలువగా రూ.1500 లంచం ఇస్తేనే ఆయా సర్ట్ఫికేట్స్‌ను మంజూరు చేస్తానని తెలిపింది. ఆయా డబ్బులు ఇవ్వలేని రాజుగౌడ్ నిజామాబాద్ ఎసీబీ అధికారులను 10.8.2007న సంప్రదించాడు. దీంతో ఎసీబీ అధికారులు పథకం ప్రకారం స్వర్ణలత లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన కరీంనగర్ ప్రత్యేక ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు నిందితురాలు స్వర్ణలతపై నేరం రుజువు కావడంతో సంవత్సరం కఠిన కారాగారపు జైలుశిక్షతో పాటు ఆరు వేల రూపాయలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు.