కరీంనగర్

కొత్త ఏడాదిలో సరికొత్త నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 31: కొత్త ఏడాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దీనిని అమలు చేసేందుకు తనకు అచ్చివచ్చిన ఉమ్మడి జిల్లాను ఎంచుకుని, ఆచరణలోపెట్టేందుకు నేడు అడుగిడబోతున్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలు సస్యశ్యామలం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం, అందుకవసరమైన జలాశయాల నిర్మాణ పనులు పరిశీలించేందుకు వస్తున్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం మొదటిసారిగా చేపట్టిన జిల్లాల పర్యటన ఉమ్మడి జిల్లానుంచే ప్రారంభిస్తుండగా, రెండు రోజుల పాటు జిల్లాలో మకాం వేయనున్నారు. ఈసందర్భంగా రాష్ట్రానికి పచ్చలహారం అందించే తన మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనుబంధంగా నిర్మిస్తున్న మేడిగడ్డ,అన్నారం, సుందిల్ల బ్యారేజీలు, కనె్నపల్లి, గోలివాడ, రాజేశ్వర్‌రావుపేట, రాంపూర్ పంపుహౌజ్‌ల నిర్మాణ పనులు పరిశీలించనున్నారు. గత నెల 18నే జిల్లా పర్యటనకు ఏర్పాట్లు చేయగా, పెథాయ్ తుఫాను ప్రభావంతోవాతావరణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు. మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా తన తొలి పర్యటన ఉమ్మడి జిల్లానుండే చేపట్టారు.
ఈ ఏడాది మద్యనాటికి కాళేశ్వరం నీటిని రాష్ట్ర ప్రజలకు అందించాలనే లక్ష్యంతో, పనులు శరవేగంగా పూర్తిచేసేలా ప్రోత్సహించే క్రమంలోనే తన పర్యటన చేపట్టినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సెంటిమెంట్‌నే అధికంగా నమ్ముకునే ముఖ్యమంత్రి ఆదినుంచి తనను అన్నివిధాలుగా ఆదుకుని, వరుసగా రెండోసారి తనకు అధికారపీఠం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే తన అధికారిక కార్యక్రమాలు ప్రారంభిస్తుండటం గమనార్హం. నేటిమధ్యా హ్నం 12.05 గంటలకుమొదలై 1గంటలకు నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి కన్నపెల్లి పంపుహౌజ్‌కు మధ్యాహ్నం 2గంటలకు చేరుకుని, పనులు పరిశీలించిన అనంతరం మధ్యాహ్న భోజనం చేసి, 3.10గంటలకు అన్నారం బ్యారేజీ పనులు, 3.45ని.లకుసుందిల్లబ్యారేజీ పనులు, సాయంత్రం 4.15ని.లకు గోలివాడ పంపుహౌజ్ నిర్మాణ పనులు పరిశీలిస్తారు. 4.45ని.లకు అక్కడి నుంచి తిరుగు పయనమై, 5గంటలకు నగర శివారులోని తీగలగుట్టపల్లిలో గల తన నివాసానికి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి, ఈనెల 2 బుధవారం ఉదయం 11గంటలకురాజశే్వర్‌రావు పేటపంపుహౌజ్, 11.45 ని.లకు మల్యాల మండలంలోని రాంపూర్‌లో నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులు పరిశీలిస్తారు. అనంతరం మద్యాహ్నం ఒంటి గంటకు తిరుగు పయనమైతారని అధికార వర్గాలు తెలిపాయి.