కరీంనగర్

బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 2: బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంక్షించారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా మంగళవారం కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్‌కువచ్చి బస చేయగా, బుధవారం ఉదయం కలిసేందుకువచ్చిన వీఐపీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ పుష్పగుచ్చాలు అందించారు. రెండో విడుత ఎన్నికల అనంతరం మొదటి సారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లాలోని అన్నిప్రభుత్వ విభాగాల అధికారులు మర్యాద పూర్వకంగా (కలిశారు. అలాగే అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా అభివృద్ది పనులు పూర్తి చేసి బంగారు తెలంగాణ సాధనలో తమవంతు భాగస్వామ్యం ఉండాలని ఆకాక్షించారు. అనంతరం పేరుపేరున అధికారులను, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. గత జ్ఞాపకాలు వారితో పంచుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు నేరుగా తనకు ఇవ్వాలని సూచించారు. అనుకోని ఆప్యాయతకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉబ్బితబ్బిబయ్యారు. కేసీఆర్‌ను కలిసి వారిలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డిజిపి మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ కమలాసన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

రాజేశ్వర్‌రావుపేట
రివర్స్‌పంపింగ్‌నిర్మాణ పనులు పరిశీలన
ఇబ్రహీంపట్నం, జనవరి 2: కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుండి ఎస్సారెస్పీకి నీటిని తరలించి రైతుల కష్టాలను తీరుస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట్ శివారులో వరదకాలువపై నిర్మిస్తున్న రివర్స్ పంపింగ్ పనుల పరిశీలించారు. మధ్యాహ్నం 1.45కు చేరుకోవాల్సింది 2గంటలు అలస్యంగా 4.15కు చేరుకొని అధికారులు, ఇంజనీర్లతో కలిసి మొదట గ్యాలరీని పరిశీలించి నిర్మాణపనుల అలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీర్లు, అధికారులతో కాసేపు పనుల్లో వేగం పెంచేందుకు దిశానిర్దేశం చేశారు. సీఎంకు ప్రజాప్రతినిధులు,అధికారులుపుష్పగుచ్ఛం అందించారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియగా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎస్ కే.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇఎన్‌సీ మురళీధర్, నవయుగ చైర్మన్ విశే్వశ్వరరావు,ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ, జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు,ప్రశాంత్‌రెడ్డి,ఎఎస్పీ మురళీధర్,డీఎస్పీలు మల్లారెడ్డి, ప్రతాప్, సీఐలు, ఎస్సైలు అధికారులు పాల్గొన్నారు.

సుందిల్ల బ్యారేజీ పనులను
పరిశీలించిన సీఎం కేసీఆర్
మంథని, జనవరి 2: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజి, గుంజపడుగు పంప్‌హౌస్ పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం రోజున పరిశీలించారు. ఇక్కడ నిర్మిస్తున్న కాల్వ పనులను పర్యవేక్షించారు. పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన పురోగతి పనుల వివరాలను ఇంజనీరింగ్ నిపుణుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సుందిల్ల బ్యారేజీ సాంకేతిక వివరాలను సి ఎం తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు క్షేత్ర స్థాయిలో పర్యటనలో భాగంగా కెసి ఆర్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ఎన్నికైన తరువాత మంథని మండలంలోని సుందిల్ల, గుంజపడుగు ప్రాజెక్ట్‌లో సందర్శించారు. ఈ సందర్భంగా సీఎంకు జిల్లా కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్వాగతం పలికారు.

సాగునీరు అందించడంలో
ప్రభుత్వం విఫలం
* మంథని ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు
కాల్వశ్రీరాంపూర్, జనవరి 2: రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీ్ధర్ బాబు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ డి-83, డి-86 కాలువల ద్వారా నీరు ఎందుకు విడుదల చేయడం లేదని? ప్రశ్నిస్తూ ఇరిగేషన్ మంత్రి, సంబంధిత అధికారులు లేక రైతులు తమ సాగునీటి కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రెండు సంవత్సరాల తరువాత వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు నీటి గురించి పర్యటిస్తున్న కేసిఆర్ గత రెండు సంవత్సరాలుగా కాలువ నీరు అందించక రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. వెంటనే ఎస్సారెస్పీ సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట చేతి ధర్మయ్య, శశిభూషణ్ కాచె, ఎం.డి.మునీర్, చదువు రాంచంద్రారెడ్డి, ఆడెపు రాజు, మేడి అశోక్, బంగారు రమేష్, గాదనవేన సదయ్య తదితరులు ఉన్నారు.
వరదకాల్వతో బీడు భూములు సాగులోకి వస్తాయి
కరీంనగర్ రూరల్, జనవరి 2: 10 సంవత్సరాలుగా కొత్తపల్లి మండలంలోని 5 గ్రామాల ప్రజలు, రైతులు గత పాలకుల నిర్లక్ష్యంతో తీవ్ర నీటీ ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అచంపల్లి వరుద కాల్వ నిర్మాణం పూర్తయితే బీడు భూములు సాగులోకి వస్తాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల వద్ద వరుద కాల్వ, తూము నిర్మాణం పనులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాగులమల్యాల, కమాన్‌పూర్, ఎలగందల్, ఆసీఫ్‌నగర్, బద్దిపల్లి గ్రామాల్లో గత 10 సంవత్సరాలుగా గర్షకుర్తి, విలాసాగర్‌ల నుండి ప్రకృతి సహజంగా వచ్చే వరుదకాల్వ ద్వారా నీరు ఈ 5 గ్రామాలకు వచ్చేదని తెలిపారు. టీఆర్‌ఎస్ ఆధికారంలోకి వచ్చిన తర్వాత నాగులమల్యాల వద్ద వరుదకాల్వ నిర్మాణంకు 2 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టిందన్నారు. పనుల జాప్యం వల్ల అంచనా వ్యయం పెరిగిందని తెలిపారు.

త్వరలో ధర్మపురి
స్వామిని దర్శిస్తా..
* సీఎం చంద్రశేఖర్‌రావు
ధర్మపురి, జనవరి 2: అతి త్వరలో ధర్మపురి క్షేత్ర సందర్శనకు వస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం కరీంనగర్‌లోని తెలంగాణ భవన్‌లో ధర్మపురి శా సనసభ్యులు కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. దేవస్థానం పక్షాన ఎమ్మెల్యే ఈశ్వర్ స్వామి వారి శేషవ్రస్తాలను, ప్రసాదాదులను కేసిఆర్‌కు అందజేశారు. బొజ్జా రమేశ శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య ఆయనకు వైదికాశీస్సులు అందజేశా రు. ఈ సందర్భంగా ధర్మపురి దేవస్థానాన్ని సందర్శించాలని కేసిఆర్‌ను ఆహ్వానించిన క్రమంలో ఆయన నరసింహ స్వామి దర్శనం చేసుకుంటానని, తాము అతి త్వరలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించు కుంటామని హామీ ఇచ్చారు. దేవస్థాన అభివృద్ధికి ఈ సంవత్సర బడ్జెట్‌లో 50కోట్ల నిధులను కెటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూ, క్షేత్ర, దేవస్థాన అభివృద్ధికి ఇతోధిక చేయూత అందించ గలమని ప్రకటించారు.

ఎలక్షన్ల లొల్లి మొదలైంది..
* పోటీ చేసేది మావోడే.. గెలిచేది మేమే..
* జోరందుకున్న విందు రాజకీయాలు
* అలకలతో కలకలం రేపుతున్న యువత
* ఆశావహుల బుజ్జగింపులు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 2: సర్పంచ్‌ల సం‘గ్రామా’నికి షెడ్యూలు విడుదలకావటంతోనే, పల్లెల్లో ఎలక్షన్ల లొల్లి మొదలైంది. నిన్నటి దాకా అంతా కలిసి మెలిసి ఎమ్మెల్యేలకు మద్ధతు తెలిపిన వారంతా, నేడు గ్రూపులుగా విడిపోయి..పోటీ చేసేది మావోడే..గెలిచేది మేమే అంటూ గ్రామాల్లో ప్రచారం కూడా చేయటం ఆరంభించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు..మావోన్ని గెలిపిచ్చుకుంటాం..సర్పంచ్ కుర్చీలో కూకోపెడుతామంటూ ప్రతినబూనుతున్నారు. దీంతో ఊళ్ళల్లో ఉంటూ ఊరొళ్ళకు అంతో ఇంతోమంచి చేద్దామనే భావనతో పోటీ చేసేందుకు ముందుకొచ్చేటొళ్ళంతా వెనుకడుగేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కొంతమంది రాజకీయ రుచి మరిగిన నాయకులు ఔత్సాహిక యువతను నిరుత్సాహ పరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. సర్పంచ్ గిరీ అంటే ఆశామాశీయా..అది మీతోనేమైతది...పోరగాళ్ళు ...రోజుకు ఎంతమందిని సముదాయించాలే.. ఎంతమందికి జవాబులు చెప్పాలే...సప్డేక ఏదో ఓపని చేసుకోపోండ్లి. ఓట్లంటే ఉత్తగనే అనుకుంటండ్లా ..మీకేం అనుభవముంది... ఆశామషీగా మాట్లాడుతండ్లు. ఎంత ఖర్సుంటంది, ఎన్ని లెక్కలుంటయి, ఇంకెన్ని రాజకీయాలుంటయ్.. అంటుండటంతో పల్లెపీఠంపై మక్కువతో ఉన్న యూత్ పోటీ చేయటంపై సందిగ్దంలో పడుతున్నారు. పల్లె రాజకీయాల్లోకి యువత ప్రవేశిస్తే.. ఏళ్ళనాటి నుంచి ఏలుతున్న పెద్దమనుషుల పలుకుబడి తగ్గిపోయి, పట్టించుకునే వారుండరనేది అడ్డుపుల్లలేసే వారి ఆలోచన అంటూ ఊరును, ఊళ్ళోని జనాలను దోచుకునేందుకు అనుభవం అవసరం కావాలె కానీ, ఊరి బాగోగులు చూసుకునేందుకు అనుభవమెందుకంటూ కొంతమంది యువకులు మండిపడుతున్నారు. మంచి చేసేందుకు వ్యక్తిత్వం, నిబద్ధత, దృఢచిత్తం అవసరం కానీ, వయసు ప్రామాణికమా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా అక్కడక్కడా ఎదురవుతున్నాయి. దీంతోడాంభికాలు కొట్టేవారు వెనక్కుతగ్గుతుండగా, పోటీలో ఖచ్చితంగా ఉంటారనే వారిని బుజ్జగింపులకు దిగుతున్నారు. దావత్‌లు పెడుతూ ఆశావహులను పిలిచి, తమకు మద్ధతుగా ఉండాలంటూ, మరోసారి అవకాశం కల్పిస్తామంటూ ఒప్పించే యత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తమకు హాండిచ్చారంటూ మరికొంత మంది యువకులు అలకలకు దిగుతుండగా, వారికి స్పష్టమైన హామీలిస్తూ, తమవెంట తిప్పుకునేందుకు రిజర్వేషన్లు అనుకూలించిన నేతలు నానాతంటాలు పడుతుండగా, నోటిఫికేషన్‌కు ముందే రాజకీయాలు ర సకందాయంలో పడ్డాయి.