కరీంనగర్

గులాబీ ప్రభంజనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 25: పంచాయతీ ఎన్నికల రెండోదఫా పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 18 మండలాల్లోని 337 పంచాయతీలు, 2,692 వార్డులకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,848 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా రెండో దఫా పల్లె పోరులో గులాబీ ప్రభంజనమే సాగింది. ఉమ్మడి జిల్లాలోని 18 మండలాల్లో 52గ్రామ పంచాయతీలు, 956 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్,జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 5,52,213 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 2,17,891 మంది, పురుషులు 2,51,813 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 89.52% శాతం, జగిత్యాల జిల్లాలో 80.23 శాతం, సిరిసిల్ల జిల్లాలో 82.37 శాతం, పెద్దపల్లి జిల్లాలో 89.29 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెండవ విడత పంచాయతీ పోల్‌లో కూడా పల్లెల్లో గులాబీ ప్రభంజనం సాగింది. పంచాయతీ పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వికలాంగులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలలో తుపాకుల పహారాలో ఎన్నికలు సాగగా, పోలీస్ నిఘా నేత్రాలు అనునిత్యం పనిచేశాయి. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగానే పల్లెల్లో 144 సెక్షన్‌ను విధించారు. పోలింగ్‌కు సరిపడా సిబ్బందిని నియమించినప్పటికినీ అదనంగా అవసరమైతే వినియోగించుకునేందుకు కూడా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రూట్ ఆఫీసర్లను గాను ఇందుకు నియమించింది. పోలింగ్ జరిగిన పంచాయతీలో తెరాస సంబరాలు అంబరాన్నంటాయి. ఇందులో కరీంనగర్ జిల్లాలో ఐదు మండలాల్లోని 107 పంచాయతీలకు గాను ఐదు ఏకగ్రీవం కాగా, 105 పంచాయతీలకు 439 మంది, 1,014 వార్డులకు 167 మంది ఏకగ్రీవం కాగా, 847 వార్డులకు 2,354 మంది అభ్యర్థుల స్థానాలకు పోలింగ్ నిర్వహించగా, ఇందులో 1,46,623 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని ఆరు మండలాల్లో 122 పంచాయతీలు ఉండగా, 22 పంచాయతీలకు ఏకగ్రీవం కాగా, 100 పంచాయతీలకు 426 మంది పోటీ చేయగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పెద్దపల్లి జిల్లాలోని మూడు మండలాల్లో 76 పంచాయతీలకు గాను 9 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 67 పంచాయతీలు, 718 వార్డులకు గాను 164 ఏకగ్రీవం కాగా, 554 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 1,01,053 మంది ఓటర్లు ఉండగా, 90,223 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో నాలుగు మండలాల పరిధిలో 84 పంచాయతీలకు గాను 16 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 68 పంచాయతీలకు 744 వార్డుల్లో 236 ఏకగ్రీవం కాగా, 508 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా 1,07,534 మంది ఓటర్లు ఉండగా, 88,579 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రెండో దఫా పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు,్భరీ భద్రత చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రశాంత వాతావణంలో ఎన్నికల నిర్వహణకు పోలీసుల పహారా కాశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమై 1 గంటలకు ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించగా, ఇంకా పలు గ్రామాలలో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. సర్పంచ్‌లుగా ఎన్నికైన వారికి దృవీకరణ పత్రాలను అధికారులు ఆందజేస్తు ఉపసర్పంచ్‌ల ఎన్నికకోసం వార్డు సభ్యులుగా ఎన్నికైన వారిని ఆయా కేంద్రాలలోనే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గులాబీ ప్రభంజనం కొనసాగగా, పల్లెల్లో తెరాస శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

సర్పంచ్, ఉపసర్పంచ్ ఎన్నిక నిలిపివేత
మల్లాపూర్, జనవరి 25: మండల కేంద్రమైన మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్పంచ్, ఉపసర్పంచ్ ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేయడంతో ఎన్నిక నిలిపివేశామని ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల తర్వాతనే తిరిగి ఎన్నిక జరుపుతామని పేర్కొన్నారు.
సిరిసిల్లలో అర గంట పాటు అకాల వర్షం
సిరిసిల్ల, జనవరి 25: సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. రెండు రోజులుగా వాతావరణం మేఘావృతం, స్వల్పంగా చలితో ఉన్న నేపథ్యంలో అనుకోకుండా వర్షం కురిసింది. సుమారు అర గంట సమయం పాటు మోస్తరు వర్షం కురిసింది.

అస్థిత్వానికి ప్రతీక ఓటు

కరీంనగర్ టౌన్, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు పాత్ర కీలకమని, మనిషి ఆత్మగౌరవం, అస్థిత్వానికి ప్రతీకగా వెలుగొందుతుందని రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్, గ్రూప్ వన్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకుని ఇండియన్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ కరీంనగర్ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, నేటి పోటీ సమాజంలో ఓటే బలమైన ఆయుధమని, పాలకుల అవినీతి, అక్రమాలు, అరాచకాలపై సంధించే అస్త్రం ఓటు మాత్రమేనని అన్నారు. దురదృష్టవశాత్తు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవటంలోనేటి పౌరులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన ఓట్లను తిరిగి నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు నమోదుపై అత్యధిక మంది కనబరుస్తున్న నిర్లక్ష్యంతోనే నామమాత్రంగా జరుగుతోందని, దీనిని కొంతమంది స్వార్ధ రాజకీయ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. దీనిని అధిగమించేందుకు ఐసో ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, ఉచితంగా ఓట్లునమోదు చేస్తుండటం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకునేందుకు ఉత్సాహం కనబర్చాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి సిబ్బంది కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించిన అనంతరమే ఓట్లు తొలగించాలని సూచించారు. పట్ట్భద్రుల ఓట్ల నమోదులోసైతం నిరుత్సాహం తాండవిస్తోందని, పెద్దల సభలో మేధావులు, సామాజిక సేవకులకు అవకాశం కల్పించేందుకు యువత జాగృతమై ఈనెలాఖరువరకు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా ఓటరు అవగాహన గోడ ప్రతులు ఆవిష్కరించారు.

రాష్ట్భ్రావృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం

గోదావరిఖని, జనవరి 25: తెలంగాణను మరింత బంగారుమయంగా తీర్చిదిద్ధడం ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమని రామగుండం శాసన సభ సభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో 37.94 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 7, 8, 9, 10వ డివిజన్లలో 3 కోట్లతో, 12, 42, 43, 45, 46, 47, 48 డివిజన్లలో 10.50 కోట్లతో, 11, 13, 15, 16, 17, 20, 22 డివిజన్లలో 2.36 కోట్లతో, 14, 18, 19, 21, 23, 30 డివిజన్లలో 7.13 కోట్లతో, 24. 28, 29, 31, 32, 33 డివిజన్లలో 10.50 కోట్లతో, 35, 36, 37, 38 డివిజన్లలో 4.45 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మేయర్ చిట్టూరి రాజమణి, కార్పొరేషన్ కమీషనర్ భువనగిరి శ్రీనివాస రావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసి ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఏటా వంద కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి కేటాయిస్తున్నారని చెప్పారు. ఇది వరకు ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టిన విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రామగుండం అభివృద్ధికై టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ కూడా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కెసి ఆర్ బాటలో నడవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ కోరారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, నాయకులు, కార్పొరేటర్లు కోదాటి ప్రవీణ్, పెంట రాజేష్, జనగామ నర్సయ్య, వడ్లూరి రవి, తోకల రమేష్, నాయిని భాగ్యలక్ష్మి, కొలను కవిత, దాసరి ఉమాదేవి, అచ్చ వేణు, మహాంకాళి స్వామి, తోడేటి శంకర్ గౌడ్ తదితరులున్నారు.

గణతంత్ర వేడుకలకు అంతా సిద్ధం

కరీంనగర్, జనవరి 25: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామన్నారు. 9.02గంటలకు గౌరవ వందనం స్వీకరణ, 9.10గంటల నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలపై జిల్లా సాధించిన ప్రగతిపై ప్రసంగించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఉదయం 9.25గంటలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వంచే ప్రవేశ పెట్టబడి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతిబింబించేలా తయారు చేసిన శకటాల ప్రదర్శన ఉంటుందని, 9.45గంటల కు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 10.45గంటల కు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తామని, 11.10గంటలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారులకు మంజూరైన ఆస్తులపంపిణీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.