కరీంనగర్

అడుగులువేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 14: హరిత తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో అడుగులు వేయాలని హరితహారంలో విరివిగా మొక్కలు నాటి ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి అన్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండుమూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాలు పంచుకొని సమన్వయంగా పనిచేసి మొక్కలను విరివిగా నాటి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌లను పూర్తి చేయాలని, నాటిన మొక్కలు సంరక్షించాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లోని ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటి పచ్చదనం వెల్లివిరిసేలా చూడాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్, స్వచ్ఛ భారత్‌లో భాగంగా నగరాలను క్లీన్ అండ్ గ్రీనరీగా మార్చాలని అన్నారు. నగరాల్లో చెత్త కుప్పలు లేకుండా చూడాలని,నగర శివారు ప్రాంతాల్లో డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను నూటికి నూరుశాతం లక్ష్యం చేరుకునేందుకు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతామని తెలిపారు. అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి హరితహారం విజయవంతానికి అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ఇప్పటి నుండే నర్సరీల్లో ఉన్న మొక్కల గురించి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నగరంలోని చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించి డంప్ యార్డుకు పంపించాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ ఆఫీసర్ ప్రావీణ్య, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్‌రావు, నగరపాలక సంస్థ కమీషనర్ కె.సత్యనారాయణ, అటవీశాఖ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.