కరీంనగర్

అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రజాప్రతినిధులదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, మే 8: కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం జమ్మికుంట బాలుర హైస్కూళ్లో ప్రగతిలో ఉన్న తరగతి గదుల పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం స్థానిక సివిల్ ఆసుపత్రిని సందర్శించారు. త్వరలో ఆసుపత్రి స్థాయిని వంద పడకలుగా పెంచనున్న నేపథ్యంలో ఆసుపత్రి ఆవరణలో స్థల పరిశీలన చేశారు. ఆసుపత్రిలోని రూములను, అందుతున్న వైద్యసేవలను, అందుబాటులో ఉన్న మందులు, వైద్య పరికరాలపై ఆరా తీశారు. అనంతరం నాయిని చెరువును సందర్శించారు. రిజర్వాయర్‌గా మారనున్న నాయిని చెరువు పనులకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్న నాయిని చెరువు పనులను త్వరలో ప్రారంభిస్తామని, వీటి పనుల బాధ్యతను స్థానిక నాయకులు, అధికారులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో కొన్ని పూర్తికాగా, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయన్నారు. 2019 నాటికి నియోజకవర్గంలో 99 శాతం అభివృద్ధి పనులు చేసి తీరుతామన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించిన ప్రశే్న తలెత్తనీయమన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో స్థానిక నేతల భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. నిధులు ఇప్పించడం తమ బాధ్యత అని వాటిని సరైన రీతిలో ఖర్చు చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించేవిధంగా నేతలు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్ చెరువుల అభివృద్ధితో పాటు వైద్యశాలల విస్తరణ, పాఠశాలల అభివృద్ధి, సంక్షేమ హాస్టళ్లు, పాలిటెక్నిక్ కళాశాల, బాలికల వసతి గృహం లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రగతిబాటలో ఉన్నాయన్నారు. తాగు, సాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, రానున్న రోజుల్లో ఇంటింటికి నల్లా శుద్ధజలం ఉచితంగా సరఫరా చేయడంతో పాటు తాగునీటి రంగం అభివృద్ధికి పెద్దపీఠ వేసినట్లు చెప్పారు. 200 కోట్లతో ఎస్సారెస్పీ ఆధునీకరణ పనులు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం ఏర్పాటుకు అధిక ప్రాధాన్యమివ్వాలని, వంద శాతం ఫలితాలు సాధించే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పాటుపడాలన్నారు. ఎంపి బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని, చేపట్టిన అన్ని పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలకు, తమ ప్రభుత్వానికి గల తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పర్చుకుంటామన్నారు. కేంద్రంలో నుండి రావాల్సిన బకాయిల విషయంలో తమవంతు సహకారం అందించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టినట్లు చెప్పారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడి సాధించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, ఎంపిపి గంగారపు లత, జడ్పీటిసి అరుకాల వీరేశలింగం, నాయకులు పింగిళి రమేష్, ఎక్కటి సంజీవ రెడ్డి, పొనగంటి మల్లయ్య, రాజేశ్వర్ రావు, లింగారావు, శ్రీనివాస్, రాజు, తహశీల్దార్ రజని, ఎంపిడిఓ రమేష్ తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.