కరీంనగర్

రోడ్ల అనుసంధానంతో బంగారు తెలంగాణకు బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవపూర్, జనవరి 2: బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల నుంచి రాష్ట్ర రాజధాని వరకూ రోడ్ల అనుసంధానంతో బంగారు తెలంగాణకు బాట కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కాటారం మండల కేంద్రంలో చింతకాని నుంచి మహాముత్తారం మండల కేంద్రం వరకు 2.5కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన రెండు వరుసల రహదారి పనులకు మంథని శాసనసభ్యుడు పుట్ట మధూకర్‌తో కలిసి శంఖుస్థాపన చేశారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు అంతర్గత అనుసంధాన రోడ్లు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రహదారుల నిర్మాణాలు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర, దేశ రాజధానులకు లింకు చేస్తూ అనుసంధానంగా నాలుగు వరసల రహదారుల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికతో ముందుకుపోతోందని ఎంపి వివరించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 46వేల చెరువులలో పూడికతీత , అభివృధ్ధి చేయడం లక్ష్యంగా బంగారు తెలంగాణ సాధనకు బాటలు వేస్తున్నామని అన్నారు. ఇంటింటికీ మంచినీరు అందించాలనే సదాశయంతో మిషన్ భగీరథ చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లాలోనే అత్యధికంగా రెండు వేల కిలోమీటర్ల దూరంతో రోడ్ల అనుసంధాన కార్యక్రమాన్ని మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించామని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. కాళేశ్వరం మీదుగా మహారాష్ట్ర, చత్తీస్‌ఘ్ఢ్ రాష్ట్రాలకు గోదావరి నదీపైన వంతెనల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.