కరీంనగర్

అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 10: ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజనల్, మండల అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు మంజూరు చేసిన నిధుల ఖర్చు వివరాలు సమర్పించాలని నిధులు అవసరం మేరకు ఖర్చు చేయాలన్నారు. తెలంగాణ హరితహారం పథకం కింద చేపట్టబోయే మొక్కలకు ఇటీవల కురిసిన వర్షాలకు నేల తడిగా ఉన్నందున ముందస్తుగా గుంతల తవ్వకం చేపట్టాలన్నారు. మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి వాటి వివరాలు సమర్పించాలని ఏ ఏ మొక్కలు ఎంత మేరకు కావాలో ప్రతి పాదనలు పంపాలని సూచించారు. హరితహారం కార్యక్రమ అమలుకు ప్రతి గ్రామంలో ఒక టీం ఏర్పాటుచేసి ఇందులో మొక్కల పెంపకంలో ఆసక్తి ఉన్నవారు మహిళలను భాగస్వామ్యులను చేయాలని మొక్కల పెంపకంపై వారిని చైతన్యపరచాలన్నారు. దాతలను గుర్తించి ట్రీ గార్డుల కొరకు ఏర్పాట్లు చేసుకోవాలని, కంపెనీలు సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. బ్లాక్ ప్లాంటేషన్ ప్రోత్సహించాలని ఒక ఎకరం, రెండెకరాల స్థలాలను గుర్తించి నీటి సౌకర్యం కల్పించి మొక్కలు విరివిగా నాటేందుకు చర్యలు తీసుకోవాలని మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడడంలో సమాజానికి బాధ్యత అప్పగించాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణాలను విరివిగా చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో 190 గ్రామాల్లో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలకు మంజూరుకు నిర్ణయించగా 154 గ్రామాల్లో కార్యాచరణ ప్రగతిలో ఉందని 36 గ్రామాల్లో ఇంకా కార్యాచరణ ప్రాథమిక దశలో ఉందన్నారు. మిగులు గ్రామాలు లబ్ధిదారుల ఎంపిక తదితరాలు వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలను పూర్తిచేసి యూనిట్లు గ్రౌండింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు డివిజన్, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షించి పథకాల అమలు వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ పౌసమిబసు, ట్రైనీ కలెక్టర్ గౌతం, అదనపు సంయుక్త కలెక్టర్ నాగేంద్ర, ఆర్‌డబ్యుఎస్ ఎస్‌ఇ సూర్య ప్రకాష్, కరీంనగర్ ఆర్‌డిఓ చంద్ర శేఖర్, డిఆర్ డిఎ పిడి అరుణశ్రీ, డ్వామా పిడి గణేష్, ముఖ్య ప్రణాళికాధికారి సుబ్బారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.