కరీంనగర్

జనశక్తి వాల్ పోస్టర్ల కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మే 16: సిరిసిల్ల పోలీస్ సబ్ డివిజన్‌లో కలకలం సృష్టించిన జనశక్తి నక్సలైట్ గ్రూపు వాల్ పోస్టర్ల ఉదంతంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈమేరకు సోమవారం సాయంత్రం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో డిఎస్పీ పి.సుధాకర్ అరెస్టు అయిన నిందితులను విలేఖరుల సమావేశంలో హాజర్చి పర్చి వివరాలను వెల్లడించారు. సిరిసిల్ల, ఇల్లంతకుంట మండలాలలోని పలు గ్రామాలలో ఈనెల 13న రాత్రి అంటించిన జనశక్తి వాల్ పోస్టర్ల కేసును పోలీసులు 48 గంటల్లో చేదించి వివరాలను రాబట్టారు. ప్రస్తుతం అరెస్టు అయిన వారిలో ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పయ్యావుల గోవర్ధన్(21), కొమ్ముల శ్రీనివాస్(35)లను అరెస్టు చేసి వీరి నుండి రెండు వాల్ పోస్టర్లు, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకునట్టు డిఎస్పీ సుధాకర్ వెల్లడించారు. కాగా ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న పయ్యావుల గోవర్ధన్, కొమ్ముల శ్రీనివాస్‌లు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులుగా పనిచేస్తున్నారు. గతంలో వీరు సిపిఐ(ఎంఎల్) జనశక్తి పార్టీలో పనిచేసి, ప్రస్తుతం టఫ్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్న చిన్నకోడూర్ మండలం గంగాపురానికి చెందిన మూర్తి శ్రీనివాస్‌రెడ్డి(40) అలియాస్ యాదన్నతో గోవర్ధన్, శ్రీనివాస్‌లతో పరిచయం ఏర్పడింది. సుమారు రెండేళ్ళ క్రితం పెద్దలింగాపూర్‌లో గోవర్ధన్ సోదరిని, రెడ్డి సామాజిక వర్గీయుడు ప్రేమించగా దీనిపై గొళ్ళ మల్లారెడ్డి, అనిల్‌లు గ్రామస్థులతో కలిసి వీరికి ప్రేమ వివాహం చేశారు. అప్పటి నుండి గోవర్ధన్‌కు వీరిపై కక్ష పెరిగిందని, దీనిపై గోవర్ధన్ పొలం వద్దకు వచ్చినపుడు మూర్తి శ్రీనివాస్‌తో చర్చించుకున్నారని, సమయం వచ్చినపుడు వారి సంగతి చూస్తామని గోవర్ధన్‌కు మూర్తి శ్రీనివాస్‌రెడ్డి మాట ఇచ్చినట్టు డిఎస్పీ తెలిపారు. తర్వాత పలు మార్లు వీరు కలుసుకుని, పెద్దలింగాపూర్, తదితర గ్రామాల్లో గొళ్ళ మల్లారెడ్డి, అనిల్‌లు పంచాయతీలు నిర్వహించడంపై చర్చకు వచ్చిందన్నారు. మూర్తి శ్రీనివాస్ పెద్దలింగాపూర్‌కు వచ్చినపుడల్లా గోవర్ధన్ వద్దకు కొత్త కొత్త వ్యక్తులను తీసుకవచ్చేవాడన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, జక్కుల బాబు, మరి కొందరు గోవర్ధన్‌ను, కొమ్ముల శ్రీనివాస్‌ను వేములవాడకు పిలిపించుకుని వారి చేతుల్లో కొన్ని వాల్ పోస్టర్లు పెట్టి, వాటిలో ఉన్న అంశాలను బట్టి మరికొన్ని పోస్టర్లను తయారు చేయమని చెప్పడంతో అదే రోజు రాత్రి ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, రామోజిపేట, సిరిసిల్ల మండలం చిన్నలింగాపూర్ గ్రామాల్లో అతికించినట్టు తెలిపారు. మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, జక్కుల బాబు ఆదేశాల మేరకు మరికొన్ని గ్రామాల్లో సోమవారం పోస్టర్లు అతికించడానికి వెలుతూ, సిరిసిల్ల మండలం తంగళ్ళపల్లిలో ఆటో కొరకు చూస్తుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రెండు పోస్టర్లు, ఐదు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా ఈ కేసులో మూర్తి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ యాదన్న, జక్కుల బాబుతో పాటు మరికొందరు పరారీలో ఉన్నట్టు డిఎస్పీ సుధాకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల సిఐ జి.విజయకుమార్, రూరల్ సిఐ శ్రీ్ధర్, సిరిసిల్ల ఎస్సై శ్రీనివాస్, ముస్తాబాద్ ఎస్సై మారుతి, సిబ్బంది ఎన్.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.