కరీంనగర్

సహకార బ్యాంక్ రైతులకు నాణ్యమైన విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, మే 16: ప్రపంచంలో సహకార రంగంలో అతి పెద్దదైన ముల్కనూరు సహకార బ్యాంక్ నుండి రైతులకు నాణ్యమైన మొక్కజొన్న విత్తనాలను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నట్లు ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సహకార బ్యాంక్‌లో నాలుగు రకాల మొక్కజొన్న విత్తనాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ గత దశాబ్ధాల కాలంగా సహకార బ్యాంక్ రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నదని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ విత్తనాలు వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయన్నారు. తాము ప్రవేశపెడుతున్న విత్తనాలకు ఎలాంటి ఎండు తెగులు రాకుండా కేవలం తక్కువ రోజులలో అధిక దిగుబడులు ఇస్తుందన్నారు. రైతులు 30 నుండి 45 రోజులలో తప్పనిసరిగా పంట మార్పిడి విధానాలు అవలంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ ఇంచార్జి జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు రవీందర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, వ్యవసాయ శాస్తవ్రేత్త పి.ఎస్.రాజు, సహకార బ్యాంక్ డైరెక్టర్లు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.