కరీంనగర్

ఐఎస్‌ఎల్ నిర్మాణాలలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల టౌన్, మే 19: ఐఎస్‌ఎల్ నిర్మాణాలలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో ఉందని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాల నియోజకవర్గస్థాయి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 75 శాతం ఐఎస్‌ఎల్ నిర్మాణాలు పూర్తిచేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఐఎస్‌ఎల్ నిర్మాణాలు స్వచ్ఛ్భారత్ మిషన్ పథకం కింద చేపట్టామని యుద్ధప్రాతిపదికన జిల్లాలో వందశాతం ఐఎస్‌ఎల్ నిర్మించి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఐఎస్‌ఎల్ నిర్మాణాల బిల్లుల చెల్లింపు సరళీకృతం చేశామని, పూర్తి అయిన 4-5 రోజులకే బిల్లులు చెల్లిస్తామని నిధులకు కొరతలేదని అన్నారు. ఐఎస్‌ఎల్ నిర్మాణం మంజూరైనా వెంటనే 6 వేలు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఐఎస్‌ఎల్ నిర్మాణాలకు గ్రూపుల ద్వారా రూ.5వేల వరకు రుణ మంజూరు చేస్తామన్నారు. వర్షాభావ పరిస్థితుల వలన భూగర్భజలాలు అడుగంటయని ప్రతి ఒక్కరు ఇంకుడుగుంతలు నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. అలాగే రైతులు తమ పంట చేనులలో ఫాం పాండ్ నిర్మించుకోవాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో నాబార్డ్ ద్వారా ప్రైవేటు ప్రాజెక్టుగా తీసుకొని ఈ ఫాం పాండ్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులను ఫాం పాండ్ నిర్మించుకునేలా ప్రొత్సాహించాలని అన్నారు. అనంతరం ఐఎస్‌ఎల్ నిర్మాణాలపై ప్రతిజ్ఞ చేయించారు. జడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక బాద్యతగా వందశాతం ఐఎస్‌ఎల్ నిర్మాణాలు చేపట్టుకోవాలని కోరారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఐఎస్‌ఎల్ నిర్మాణాలకు ప్రభుత్వం ఇచ్చేది 12 వేలు ఆర్థిక సాయం అని దానికి లబ్ధిదారులు 2-3 వేలు కలుపుకొని మరుగుదొడ్డితో పాటు బాత్ రూం నిర్మించుకోవాలని సూచించారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా బాత్‌రూంల నిర్మాణానికి ఉపాధి హామీ ద్వారా ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్‌కు సూచించారు. నియోజకవర్గంలో ఆగస్టు 15 వరకు ఐఎస్‌ఎల్ నిర్మాణాలు వందశాతం పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల సబ్ కలెక్టల్ కె.శశాంక, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, జగిత్యాల, సారంగాపూర్ ఎంపిపిలు, జడ్పీటిసిలు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, స్వశక్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు.