కరీంనగర్

పెద్దపల్లి నుండి నీళ్లు పోనియ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, మే 19: పెద్దపల్లి ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతున్నారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి నీళ్లు ఇచ్చిన తర్వాతే సిద్దిపేట, హైదరాబాద్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్లను తరలించాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఆర్‌డిఓ కార్యాలయం వద్ద గురువారం టిడిపి శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఓ నారాయణరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా విజయరమణారావు విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపల్లికి సమీపంలో ఉన్న గోదావరి నీళ్లను హైదరాబాద్‌కు ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రజలు మంచినీటి కోసం అల్లాడుతుంటే హైదరాబాద్ ప్రజల మెప్పు పొందేందుకు ఈప్రాంత ప్రజల గొంతులు ఆరబెడుతున్నారని విమర్శించారు. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన రైతుల భూములు వాడుకొని ఇక్కడి చెరువులను, కుంటలకు నీరందించకుండా చేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. జిల్లాలో ఎక్కడలేని రీతిలో పెద్దపల్లి డివిజన్‌లో కరవు తాండవిస్తుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి పైపుల ద్వారా వెళ్తున్న నీటిని పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పాల రామారావు, ఎడెల్లి శంకర్, సాయిని మహేందర్, ఉప్పురాజు, వినాయకరావు, గున్నాల రాజు, అక్కపాక తిరుపతి, దొడ్డుపల్లి జగదీష్, రాజు, భూతగడ్డ సంపత్, రంగు శ్రీనివాస్ పాల్గొన్నారు.