కరీంనగర్

అభివృద్ధి పనుల నిర్మాణాలు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర (కరీంనగర్), మే 20: జిల్లాలో కలెక్టర్ అత్యవసర నిధి (క్రూషియల్ బ్యాలన్స్) నుండి మంజూరైన వివిధ అభివృద్ధి పనుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో క్రూషియల్ బ్యాలెన్స్ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ నిధుల నుండి 8.79 కోట్లతో 177 పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో 77 పనులు పూరె్తైనట్లు మిగిలిన పనులు ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. పాఠశాలలకు సంబందించి మంజూరుచేసిన పనులన్ని నెలాఖరు వరకు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో వాటర్ ప్లాంట్లను మంజూరు చేశామని వాటికి నీటి సరఫరా లేకుంటే తెలపాలని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు వినియోగ దృవీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ గౌతమ్, ప్రణాళికా అధికారి సుబ్బారావు, ఇఇ షఫీ మియా, ఆర్ అండ్ బి పెద్దపల్లి ఇఇ ఇమాన్యూన్, స్ర్తి శిశు సంక్షేమ శాఖ పిడి రాధమ్మ పాల్గొన్నారు.