కరీంనగర్

రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మే 24: రాబోయే కాలంలో తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. హుజూరాబాద్ పట్టణంలో మంగళవారం జోనల్ విత్తన ధృవీకరణ సమీక్ష సమావేశం జరిగింది. దీనికి మంత్రి పోచారంతో పాటు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీడ్ కంపెనీల ప్రతినిధులతో పాటు అధికారులు, శాస్తవ్రేత్తలు పెద్ద సంఖ్యలో పలు జిల్లాల నుంచి సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ సిఎం కెసిఆర్ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాబోయే కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, మిషన్ కాకతీయ పనులు, కాలువల మరమ్మతులు వేగంగా పూర్తవుతున్నాయని వివరించారు. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో విత్తనాల ఉత్పత్తిపై రైతులు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ విత్తనాలు ఇతర రాష్ట్రాలకు దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ అంతర్జాతీయ స్థాయి సంస్థలను సర్వే కోసం పిలిపించారని, తెలంగాణలో విభిన్నంగా ఏయే పంటలు సాగుచేయొచ్చు? అనే అంశంపై పరిశోధనలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విత్తనాలకు, ఎరువులకు కొరత లేకుండా చూస్తామని, 960 సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనాలు రైతులకు సకాలంలో అందిస్తామని మంత్రి పోచారం చెప్పారు. విత్తనాలకు బ్లాక్ మార్కెట్, కల్తీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీడ్ కంపెనీలు మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రైతాంగానికి ప్రపంచాన్ని శాసించే శక్తి ఉందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో రైతులు కంట తడి పెట్టకుండా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఆర్మూర్, అంకాపూర్ రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పంట విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారు వృథా ఖర్చులు చేయరని, ఇక్కడి రైతులు కూడా అలా నడుచుకోవాలన్నారు. రంగారెడ్డి, నల్గొండ రైతులు సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా అధిక దిగుబడులు సాధిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హుజూరాబాద్‌ను సీడ్ ఉత్పత్తి జోన్‌గా మారుస్తానని చెప్పారు. రైతుల భవిష్యత్తు అంతా సీడ్ కంపెనీల చేతుల్లో ఉందని, మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చేందుకు సీడ్ కంపెనీలు కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో 75 శాతం రైతులు విత్తనోత్పత్తి చేస్తున్నారని తెలిపారు. మరిన్ని మంచి వంగడాల తయారీకి శాస్తవ్రేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతులు ఆధునికతను జోడించి వ్యవసాయం చేయాలని, అనేక కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చారని, కేవలం వరి పంటే కాకుండా విభిన్నమైన పంటలు సాగుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుల అనుమానాలను శాస్తవ్రేత్తలు, సీడ్ కంపెనీల ప్రతినిధులు నివృత్తి చేశారు. వివిధ రకాల విత్తనాలు ప్రదర్శించి రైతులకు అవగాహక కల్పించారు. ఈసందర్భంగా విత్తనాల పరంగా ఎదురవుతున్న సమస్యల్ని రైతులు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమీక్షలో విత్తన ధృవీకరణ సంస్థ ఎండి మురళి, డైరెక్టర్ కేశవులు, మెంబర్ ఐరెడ్డి భాస్కర్‌రెడ్డి, రైతు ప్రతినిధులు వంగల వెంకట్‌రెడ్డి, ఆర్‌డివో చంద్రశేఖర్, పలు మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు, ఎడిఏలు, వ్యవసాయాధికారులు, సీడ్ కంపెనీల ప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు, రైతు నాయకులు పాల్గొన్నారు.