కరీంనగర్

అవతరణ వేడుకల్లో రెండేళ్ళ పాలన ప్రతిబింబించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 25: జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకల్లో రెండేళ్ళ ప్రభుత్వ పాలన ప్రతిబింబించాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి వేడుకల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ వేడుకలను జిల్లా నుంచి మారుమూల గ్రామాల ప్రజలు సైతం గుర్తుంచుకునేలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, హోటళ్ళు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు వ్యాపార సంస్థలు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్లలో విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. జిల్లాకేంద్రంలో ఒకరోజు తెలంగాణ వంటకాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని తెలంగాణ తల్లి విగ్రహాలకు రంగులు వేయించాలని, అమరవీరుల స్థూపాలకు మరమ్మతులు చేయించి అవతరణ దినోత్సవం రోజున పూలమాలలు వేయాలని సూచించారు. విద్యార్థులకు, ఉద్యోగులకు పలురకాల ఆటలపోటీలు నిర్వహించి, జిల్లాస్థాయిలో అవార్డుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన 25 మందిని ఎంపికచేసి రాష్ట్రావరణ దినోత్సవం నాడు నగదు బహుమతితో సన్మానించాలని సూచించారు. అవతరణ వేడుకల నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో 25కిలోల మిఠాయిలు పంచిపెట్టాలని, మున్సిపాల్టీల్లో 50 కిలోల మిఠాయిలు పంపిణీ చేయాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయాలని, అనాథ శరణాలయాలు, అంథుల పాఠశాలలో పండ్లు, మిఠాయిలు, దుస్తులు పంపిణీచేయాలన్నారు. జిల్లాలో పలు శాఖల ద్వారా మంజూరైన ఆర్థిక యూనిట్లను వేడుకల సందర్భంగా ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులతో పంపిణీ చేయించాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా కీలకపాత్ర పోషించిందని, అందుకే జిల్లాలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, గంగుల కమలాకర్, మేయర్లు రవీందర్‌సింగ్, లక్ష్మినారాయణ, ఎఎస్పీ అన్నపూర్ణ, ఎజెసి డా.ఎ.నాగేంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.