కరీంనగర్

2019లో కాంగ్రెస్‌దే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథలాపూర్, మే 25: రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంటుందని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ జోస్యం చెప్పారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఫిరాయింపులపై దృష్టిసారించిందే తప్ప ప్రజల అవసరాలను పట్టించుకోలేదని విమర్శించారు. టిఆర్‌ఎస్ పార్టీ పోలీసులకు ఐటెక్ వాహనాలను సమకూర్చి సౌకర్యాలను కల్పిస్తుంది కాని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీ నెరవేర్చడం లేదని అన్నారు. ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చకపోతే టిఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదన్నారు. టిఆర్‌ఎస్ డబ్బులున్న నేతలకే పదవులు ఇస్తుందే తప్ప చేసేదేమి లేదని ఆరోపించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు కథలాపూర్ ఎంపిపి విషయంలో ప్రొటోకాల్ పాటించడంలేదని పేర్కొన్నారు. కెసిఆర్ సిఎం పదవి చేపట్టిన నుండి అసలు వర్షాలే కరువైయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుండి కెసిఆర్ సర్కార్ లక్ష 60వేల కోట్లు అప్పు తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ జిల్లాల ఏర్పాటును మానుకుని హామీలను నెరవేర్చలని హితవు పలికారు. అనంతరం డిసిసి అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం మాట్లాడుతూ కెసిఆర్ మాటల గారిడితో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి నర్సు అంజయ్య, జిల్లా రైతు విభాగం నాయకులు రాజేందర్, కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి అజాద్ విజయ్, వేణుగోపాల్, చెదలు సత్యనారాయణ, గంగాధర్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.