కరీంనగర్

టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 26: తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని, 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలుపు కమలానికే దక్కుతుందని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్ రావు జోస్యం చెప్పారు. ఆపార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం నగరంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. దీనికి చరమగీతం పాడేందుకు ఆపార్టీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజోపయోగ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి, బడుగు, బలహీన వర్గాల పట్ల ప్రధాని మోదీ కనబరుస్తున్న చిత్తశుద్ధిని బహిరంగపర్చాలన్నారు. జిల్లాలో నిర్వహించే వికాస్‌పర్వం కార్యక్రమానికి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీరామన్‌దేఖలు పాల్గొని, పలుచోట్ల నిర్వహించే బహిరంగసభలో ప్రభుత్వ పనితీరుపై ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 29న శంషాబాద్‌లో నిర్వహించే పార్టీ ప్రతినిధుల సభలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మార్గదర్శనం చేయనున్న దృష్ట్యా, జిల్లానుంచి 1500 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బూత్ నుంచి బాధ్యులను అమిత్ సభకు తరలించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు స్పష్టంచేశారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు కన్నం అంజయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు గాజుల స్వప్న, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, నాయకులు గుజ్జ సతీష్, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, ఇందూరి సత్యం, పూదరి అరుణ, ముదుగంటి రవీందర్‌రెడ్డి, టి. హరికుమార్‌గౌడ్, పటేల్ దేవేందర్‌రెడ్డి, పెండ్యాల సాయికృష్ణారెడ్డిలతో పాటు వందమంది జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.