కరీంనగర్

మేమూ చెబుతాం.. కార్పొరేట్ పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 26: ‘నేటి పోటీ సమాజంతో మీ పిల్లలు పరుగిడేందుకు అవసరమైన విజ్ఞానం మేము అందిస్తాం. ఆంగ్లమాధ్యమంలో బోధిస్తాం. విశాలమైన తరగతి గదుల్లో అత్యాధునికమైన పద్ధతిలో విద్యార్థులకర్థమయ్యే రీతిలో స్టేట్, సిబిఎస్‌ఈ, ఐసిఎస్‌ఈ విధానంలో సమీకృత పాఠ్యాంశాలు, డిజిటల్ తరగతుల ద్వారా తర్పీదునిస్తాం. సిసిఈ పద్ధతిలో, కంప్యూటర్ బోధనలో శిక్షణ పొంది దశాబ్దాల అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలోతరగతుల నిర్వహణ ఉంటుంది. సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలు సాధిస్తూ, అత్తుత్తమైన గ్రేడ్‌లు పొందేలా మీ పిల్లలను తీర్చిదిద్దుతాం. అంతేకాదు, పుస్తకాల కొనుగోలు పేర మావద్ద అదనపు దోపిడీ అసలే ఉండదు. ఉచితంగానే అందజేస్తాం. పైపెచ్చు మధ్యాహ్నం పూట వారికిష్టమైన భోజన వసతి ఏర్పాటుచేస్తాం. వీటికితోడు రెండు జతల బట్టలు అదనం. పేద, మధ్య తరగతి విద్యార్థులైతే ఉపకార వేతనాలు కూడా మంజూరు చేస్తాం. మా పాఠశాలలోనే మీపిల్లలను చేర్పించండి’ అంటూ పలువురు ఉపాధ్యాయులు గత కొద్దిరోజులుగా గ్రామాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ, ఆయా పాఠశాలల్లో విద్యార్థులు సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలు పంచుతున్నారు. వీరి ప్రచారానికి గ్రామాల్లో స్పందన భారీగానే వస్తోంది. అయితే వీరంతా ఏ ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్‌కు చెందిన నిర్వాహకులు, ఏజెంట్లు మాత్రం కాదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు. పలు మండలాల్లో ఎంపికచేసిన ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది దాతల నుంచి సేకరించిన విరాళాలతో గత విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు, వేలాది రూపాయలు వెచ్చించి అత్యాధునికమైన గ్రంథాలయాలు ఏర్పాటుచేశారు. డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులు శిక్షణ కూడా తీసుకుని, ఇందుకనుగుణంగా పాఠాలు బోధించటంతో ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల ప్రగతి గణనీయంగా పెరిగింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు తాము చేస్తున్న కార్పొరేట్ బోధన ప్రచారాస్త్రంగా మల్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చితే విద్యార్థులకు చేకూరే లబ్ధితో పాటు ప్రయాణ భారం, పుస్తకాల మోత తగ్గుతుందంటూ తల్లిదండ్రులకు వివరిస్తూ, ఆకర్షించేయత్నం చేస్తున్నారు. వీరి ప్రచారానికి గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అనూహ్య రీతిలో స్పందిస్తూ, తమ పిల్లలను చేర్పించేందుకు ఇప్పటినుంచే ఉద్యుక్తులవుతున్నారు. చీమిడిముక్కు, చిరిగిన బట్టలు, విరిగిన బేంచీలు, రంగువెలసిన బ్లాక్‌బోర్డులకు కేరాఫ్‌గా ఇన్నాళ్ళు ప్రభుత్వ పాఠశాలలుండేవి. దీంతో వీటిలో తమ పిల్లలకు విజ్ఞానం లభించటం కాదు కదా.. కనీసం తెలుగు చదవటం కూడా రాదనే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో పాతుకుపోయింది. ఈతరుణంలో విద్యాశాఖలో వచ్చిన కొత్తనీరు ప్రభుత్వ విద్య బలోపేతంపై దృష్టిసారించి, దాతలను సమీకరించి ప్రభుత్వ పాఠశాలలకు కార్పోరేట్ హంగులు కల్పిస్తూ, గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. మారుతున్న కాలానికనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు మారితే కార్పోరేట్ వలలో పడి తమ పిల్లలను చదువుల యంత్రాలుగా మార్చుతున్న నేటి తరుణంలో దీనికి విరుగుడుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు చేపట్టిన ఈవినూత్న ప్రచారంతో, వెలవెలబోతున్న ప్రభుత్వ పాఠశాలలు తిరిగి కలకలలాడుతాయనే ఆశాభావం అందరిలో వ్యక్తమవుతోంది.