కరీంనగర్

జిల్లా కేంద్రంలో.. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, మార్చి 17: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా కేంద్రంలో మరో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి వెల్లడించారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘ఐసియు’ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం కలిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం ఐసియు ఏర్పాటు చేశామని, త్వరలోనే డయాలసిస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అన్ని సౌకర్యాలను సమకూరుస్తామన్నారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వైద్యులు సేవాభావంతో పనిచేయాలని, ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం కలిగించాలని వైద్యులకు ఉద్బోధించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఐసియు ఏర్పాటుకు కృషిచేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆసుపత్రిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ నీతూప్రసాద్, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ అశోక్‌కుమార్‌లతోపాటు పలువురు వైద్యులు, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి లక్ష్మారెడ్డికి వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
ఉదయ్ తల్లిదండ్రులను పరామర్శించిన మంత్రి
విజయవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి వొడ్నాల ఉదయ్ తల్లిదండ్రులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గురువారం సాయంత్రం పరామర్శించారు.జిల్లా ఆసుపత్రిలో ఐసియు ప్రారంభించిన అనంతరం మంత్రి నేరుగా రాంనగర్‌లోని ఉదయ్ ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. మంత్రి వెంట జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ ఉన్నారు.

ram