కరీంనగర్

ఎన్టీపిసి నిర్లక్ష్యంపై కుందనపల్లి లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, జూన్ 3: రామగుండం ఎన్టీపిసి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత గ్రామాల సంక్షేమాన్ని విస్మరిస్తుందని కుందనపల్లి గ్రామమంతా కూడా ఎన్టీపిసిపై ‘లొల్లి’కి దిగింది. కుందనపల్లిలోని విద్యుత్ ప్రాజెక్ట్‌కు చెందిన యాష్ పాండ్ (బూడిద చెరువు) నుంచి వెలువడే విషబూడిదతో ఊరంతా కమ్ముకపోగా తాగునీరు కలుషితమవుతుందని ఊరు గర్జించింది. నిర్వాసిత గ్రామం కుందనపల్లి గ్రామస్థులు సంక్షేమం.. ఊరు అభివృద్ధి.. ఉపాధి సౌకర్యాల విషయాలపై ఎన్టీపిసి యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందంటూ మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీపిసి విద్యుత్ ప్రాజెక్ట్ బూడిద చెరువు కోసం వేలాది ఎకరాల భూములను దారాదత్తం చేసిన నిర్వాసితుల యోగ క్షేమాలను యాజమాన్యం గాలికి వదిలేసిందని ఆరోపిస్తూ శుక్రవారం కుందనపల్లిలోని ఎన్టీపిసి యాష్ పాండ్ బూడిద చెరువు ముందు కార్మికులు ఎవ్వరిని లోనికి వెళ్లనివ్వకుండా పనులను నిలిపివేశారు. యాష్ పాండ్ ప్రధాన గేట్ ముందు కుందనపల్లి సర్పంచ్ మేకల సరస్వతీ మైసయ్య ఆధ్వర్యంలో పంచాయతీ పాలక పక్షం, పంచాయతీ పరిధిలోని ప్రజలంతా మూకుమ్మడిగా ధర్నాకు దిగారు. సంఘటన స్థలికి ఎన్టీపిసి సిఎస్‌ఆర్ ఎజిఎం రఫీక్, మేనేజర్ రాం కిషన్ రావు, కెఎస్ రావుతోపాటు పలువురు అధికారులు చేరుకున్నారు. దీంతో కుందనపల్లి గ్రామస్థులంతా యాజమాన్యం తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహించారు. యాష్‌పాండ్ మూలంగా తాము ఎదుర్కొంటున్న బాధలు వర్ణణాతీతమని, ఒక రోజు మీ అధికారులు గ్రామంలో ఉండి అనుభవిస్తే తెలుస్తుందని, మీతో మా సమస్యలు పరిష్కారం కావు.. ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌నే ఇక్కడికి రప్పించాలని పట్టుబట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన సిఎస్‌ఆర్ ఎజిఎం ‘పాగల్ బాత్ నక్కో...’ అని వ్యాఖ్యానించడంతో గ్రామస్థులు ఎదురు తిరిగారు. నిర్వాసితులు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధిత గ్రామంలో సంక్షేమం అభివృద్ధి చేయాలని మొత్తుకుంటే ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతారా? అంటూ.. ఆవేదన చెందారు. ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించాలని అక్బర్ నగర్‌తోపాటు గ్రామంలో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, యాష్‌పాండ్ నుంచి కుందనపల్లి శివారులో ఉన్న బుగ్గ రామస్వామి దేవాలయం వరకు బిటి రోడ్డు, గ్రామంలో అంతర్గత రహదారులు, డ్రైన్‌ల నిర్మాణం, పంచాయతీ పరిధిలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశం, గ్రామంలో ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపిస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకు కూర్చుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయినా ఆందోళన విరమించేది లేదని సర్పంచ్ తేల్చి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.