కరీంనగర్

రెండేళ్లలో చుక్కనీరు ఇవ్వలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ శ్రీరాంసాగర్ కాలువ ద్వారా రైతులకు చుక్క నీరు ఇవ్వలేదని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు విమర్శించారు. శుక్రవారం సుల్తానాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వర్షాలు పడే సమయంలో మంత్రి శ్రీరాంసాగర్ కాలువలను పరిశీలిస్తూ కాలువల అభివృద్ధికి 200 కోట్లు మంజూరయ్యాయనటం సరికాదన్నారు. కాకతీయ కెనాల్‌కు నిధులు మంజూరైతే శ్రీరాంసాగర్ కాలువకు మంజూరయ్యాయంటూ రైతులను మోసం చేయటం తప్ప మరేమిలేదన్నారు. రైతుల పక్షాన తమ పార్టీ, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తీవ్ర కరవు పరిస్థితుల దృష్ట్యా ఎల్లంపల్లి నుండి వెళ్లే నీటిని ఆరెపల్లి వద్ద రైతుల కోసం, పశువుల కోసం తాను నీరు వదిలిపెడితే తనపై కేసు పెట్టకుండా నాయకులపై, కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆరోపించారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర నాయకుడు గంట రాములు, మండల పార్టీ అధ్యక్షుడు పాల రామారావు, సింగిల్‌విండో చైర్మన్ కల్లెపల్లి జానీ, కుమార్ కిషోర్, వెగోలం అబ్బయ్య, అమిరిశెట్టి తిరుపతి, ఉస్తెం గణేష్, అమిరిశెట్టి రాజలింగం, చిలుక సతీష్ ఉన్నారు.