కరీంనగర్

మోగనున్న బడిగంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 12: రాతపూతలు, చేతిలో పుస్తకాలతో అర్ధరాత్రుల వరకు చదివి అలసి, సొలసిన విద్యార్థుల సేద దీర్చిన వేసవి సెలవులు ముగిసాయి. 48రోజుల పాటు వినోద, విహారాలు, ఆట, పాటలతో మమేకమైన చిన్నారులు ఇక వాటికి టాటా చెప్పి, తిరిగి పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభం కానుండగా, సెలవులతో మూసిన పాఠశాలలు నేటినుంచి తెరుచుకోనున్నాయి. విద్యార్థుల చదువుల దైనందిని ఆరంభించేందుకు ఉపాధ్యాయులు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రూపొందించుకున్న పాఠ్యాంశాల షెడ్యూల్‌ను అందించనుండగా, పైతరగతులకు ప్రమోట్ కాబోతున్నందుకు చిన్నారులు ఆనందంగా బడిబాట పట్టేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలన్నీ ఇప్పటికే విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పక్షం రోజుల నుంచే విద్యార్థులనాకర్షించేందుకు అన్ని రకాల యత్నాలు చేస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సైతం మేమేం తక్కువ అన్నట్లుగా గ్రామాల్లో ప్రచారాలు చేపట్టి, కార్పోరేట్‌ను తలదనే్నస్థాయిలో బోధిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు హామీలు ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా తమ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తూ, వాటి రూపురేఖలనే మార్చుతుండటంతో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలవైపు విద్యార్థులు దృష్టిసారిస్తున్నారు. దీంతో ఈవిద్యాసంవత్సరం ప్రైవేట్ పాఠశాలలకు పెద్దదెబ్బే తగలబోతుందని నిర్వాహకులే పేర్కొంటుండటం గమనార్హం. గతంలో మాదిరిగా నామ్‌కే వాస్తేగా కాకుండా, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టిసారించటం, ఔత్సాహిక ఉపాధ్యాయుల చొరవతో ఎంపికచేసిన పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించటం, ఆధునిక తరగతి గదుల్లో అత్యాధునిక స్థాయిలో బోధన చేపడుతూ, అదేస్థాయిలో ఫలితాలు సాధించి కార్పోరేట్ స్కూళ్ళకే సవాల్ విసిరేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటంతో రెండేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశపెట్టగా అది విజయవంతమైంది. దీంతో ఈవిద్యా సంవత్సరం నుంచి మెజారిటీ పాఠశాలల్లో దీనిని ప్రారంభించేందుకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఉపాధ్యాయుల పనితీరుపై నిఘా వ్యవస్థను ఏర్పాటుచేస్తుండగా, బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈయేటినుంచి పాఠశాలల్లో అమలుచేసేందుకు శ్రీకారం చుడుతుండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేందుకు పలు గ్రామాల్లో తీర్మానాలు కూడా చేస్తున్నారు.