కరీంనగర్

అమ్మాయిలకు అండ ‘సుకన్య సమృద్ధి యోజన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, మార్చి 17: అమ్మాయిల బంగారు భవిష్యత్తుకు కొండంత అండ ‘సుకన్య సమృద్ధి యోజన పథకం’ అని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో సుకన్య సమృద్ధి యోజన పథకం పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ‘బేటి బచావో-బేటి పడావో’ అనే నినాదంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం కింద పదేళ్ల లోపు అమ్మాయిల పేరున ఖాతాను ఏ పోస్ట్ఫాసులోనైనా తెరువవచ్చన్నారు. దేశంలో ఇంతవరకు 80 లక్షల ఖాతాలు ప్రారంభించగా, కరీంనగర్ జిల్లాలో 58 వేల ఖాతాలు ప్రారంభించారని తెలిపారు. జిల్లాలో 2.70 లక్షల మంది పదేళ్ల లోపు ఆడపిల్లలు ఉన్నారని, వారందరి పేరున ఈ పథకం కింద ఖాతాలు ప్రారంభించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.జిల్లాలో మిగిలిన ఆడ పిల్లలందరికీ పథకం ద్వారా ఖాతాలు ప్రారంభించేందుకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ వర్కర్లకు బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఈనెల 30 లోగా యుద్ధ ప్రాతిపదికన ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద నెలకు వేయి రూపాయల చొప్పున 14 ఏళ్లు చెల్లిస్తే 1.68 లక్షలు వేలు జమ అవుతాయని, దానికి చక్రవడ్డీతో కలిపి రూ.6,15,784 చెల్లిస్తారని వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి పొదుపు సొమ్ముకు 9.2 శాతం చక్రవడ్డీగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సంవత్సరానికి నెలకు వేయి చొప్పున కనీసం 12 వేలు, గరిష్టంగా సంవత్సరానికి రూ.1.50 లక్షలు మించకుండా ఈ ఖాతాల్లో జమ చేసుకునేందుకు వీలుందని తెలిపారు. ఖాతాలను దగ్గరలో ఉన్న పోస్ట్ఫాసులో ఖాతా ప్రారంభించవచ్చని, తల్లిదండ్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోస్ట్ఫాస్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ, పోస్టుమాస్టర్ నర్సింహాస్వామి పాల్గొన్నారు.