కరీంనగర్

చర్చలు విఫలమైతే సమ్మె తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 13: విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు యాజమాన్యంతో చేపట్టిన చర్చలు విఫలమైతే సమ్మె తప్పదని, సంస్థలోని అన్ని విభాగాల సిబ్బంది సమ్మెలో పాల్గొనేందుకు సన్నద్ధం కావాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ (టిఈటిఫ్) జిల్లా చైర్మన్ కె.జయాకర్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని విద్యుత్ సూపరెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట సమ్మె సన్నాహక సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జయాకర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్టమ్రేర్పాటైతే విద్యుత్ కార్మికుల సమస్యలు తొలగుతాయని చెప్పిన నేటి సిఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి రెండేళ్ళు గడిచినా తమ ఇబ్బందులు మాత్రం తొలగించలేదని విమర్శించారు. ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరిస్తానని చెప్పి, తాజాగా వారిని ఔట్‌సోర్సింగ్ కార్మికులుగా పేర్కొంటూ ప్రభుత్వం పక్కకు నెడుతుందని మండిపడ్డారు. ఆగస్టు 31 2004 వరకు సర్వీసులో ఉన్న ఉద్యోగులందరి ఈపిఎఫ్ ఖాతాలను జిపిఎఫ్ ఖాతాలకు మళ్ళించి, పెన్షన్ రూల్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టులను సత్వరమే భర్తీ చేసి, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని, ఒప్పంద కార్మికులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను కారుణ్య నియామకాల ద్వారా ఆదుకోవాలని, నోషనల్ ఇంక్రిమెంట్లతో ఏర్పడిన మూలవేతనంలోని వ్యత్యాసాలను సరిచేయాలని, ట్రాన్స్‌కో, జెన్‌కోలలో పెన్షన్, గ్రాట్యుటీ, జిపిఎఫ్, మాస్టర్ ట్రస్ట్‌లను ఏర్పాటుచేసి, యూనియన్ ప్రతినిధులను ట్రస్టీలుగా నియమించాలని, విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను ఆపాలని, ఒప్పంద కార్మికులకు రూ.పదిలక్షల బీమా సౌకర్యం వర్తింపజేయాలని, 18 మే 1997 నాటి ఒప్పందం మేరకు అన్ని సబ్‌స్టేషన్‌లలో డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను నియమించాలని, ఎపిలో ఉన్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులను వెనుకకు రప్పించాలని, జనరేటింగ్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించరాదని, విద్యుత్ సంస్థలోని ఉద్యోగులందరికి ఒకే మస్టర్ స్కేల్ వర్తింపజేయాలని, డిస్కంలలో బదిలీల కోసం అవకాశం కల్పించాలనే డిమాండ్లను యాజమాన్యం వద్ద చర్చకు తేబోతున్నట్లు, వీటన్నిటి పరిష్కారానికి సానుకూల స్పందన లభిస్తేనే విధులు నిర్వహించాలని, లేనిపక్షంలో ఈనెల 15 ఉదయం 6గంటలనుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఈ రంగారావుకు సమ్మె నోటీస్ అందజేసి, సిబ్బంది సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. విద్యుత్ సంస్థలోని 13 కార్మికసంఘాల నాయకులు, సర్కిల్ పరిధిలోని వందలాది మంది విద్యుత్ ఉద్యోగులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.