కరీంనగర్

శాస్ర్తియ పద్ధతిలో జిల్లాను విభజించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకంరపుర (కరీంనగర్), జూన్ 14: జిల్లాను అందరికీ ఆమోద యోగ్యంగా, శాస్ర్తియ పద్ధతిలో, హేతుబద్ధంగా విభజన చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మంగళవారం కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో 57 మండలాలు, 2 మున్సిపల్ కార్పొరేషన్‌లు, 9 మున్సిపాలిటీలతో 90 కి.మీల రేడియేషన్‌లో అన్నిరకాల వనరులతో సస్యశ్యామలంగా వ్యవసాయ అనుకూల వాతావరణంలో ఉందన్నారు. విభజన పేరుతో కరీంనగర్ జిల్లాను కుక్కలు చింపిన విస్తరి చేస్తూ ఇతర జిల్లాలో అనాలోచితంగా కలిపాలని ప్రభుత్వం చూస్తే చూస్తూ ఊరుకోబోమని వినతిపత్రంలో స్పష్టం చేశారు. విభజన ప్రక్రియ ప్రజల సౌకర్యార్థం జరగాలని, గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయం తెలుసుకొని తీర్మానించి బహిరంగపర్చాలన్నారు. అధికార పార్టీ నేతలతో అధికారులు కుమ్మక్కై గ్రామాల్లో దండోరా వేయకుండా, గ్రామ సభల తీర్మానం లేకుండా నివేదికలు సమర్పిస్తున్నట్లు ఇది హేయమైన చర్య అన్నారు.