కరీంనగర్

సర్కారు బడులకు ప్రక్షాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూన్ 17: నాణ్యమైన విద్యకు చర్యలు చేపట్టతున్నట్లు ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డిలు తెలిపారు శుక్రవారం స్థానిక ఐబి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల నుండి నష్ట పోతున్న విద్యావ్యవస్థను కాపాడుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాలన చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.5కోట్లతో 250 రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేజి టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈయేడాది నుండి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిందన్నారు. స్థానిక ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఒక్కోక్క మండలం నుంచి ఒక పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానని ఆయన హామి ఇచ్చారు. ఈకార్యక్రమంలో మందల సత్యనారాయణరెడ్డి, ఉప్పు రాజ్‌కుమార్, రఘువీర్‌సింగ్, పడాల స్వామిగౌడ్, అశోక్‌గౌడ్, పెగడ రమేష్, మేకల శ్రీనివాస్, సాబీర్‌ఖాన్, చంద్రవౌళి,కట్కూరి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.