కరీంనగర్

ఇంటింటా మొక్కలు నాటండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 23: ప్రకృతి వినాశనం వల్ల మానవళి మనగడకు ముప్పు వాటిళ్లుతుందని, రోజు రోజుకు అంతరించి పోతున్న అడవులు, తరిగి పోతున్న గుట్టల వల్ల వాతావరణంలో సమతుల్యత లోపించి తీశ్ర కాలుష్యం వల్ల వర్షాభావ పరస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ అందుకే అటవీ సంపద కాపాడుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరిత హారంలో అందరు భాగస్వాములై ఇంటింట మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్థానిక నందన గార్డెన్‌లో తెలంగాణకు హరిత హారం కార్యక్రమంపై పెద్దపల్లి డివిజన్ స్థాయి అధికారులు, ప్రజాప్రతి నిధులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ 100 మంది గ్రానైట్ యజమానులు కాసుల పంట పండిస్తూ, జిల్లాలో ఉన్న గుట్టలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవులు, గుట్టలు అంతరించిపోవడం వల్ల నేడు కోతులు, అడవి పందులు, ఇతర జీవరాసులు గ్రామాల్లోకి ఇచ్చి, సమాజంలో మానవ మనుగడకు ముప్పు తలపెడుతున్నాయన్నారు. అందుకే అడవులను తలపించే విధంగా ఉద్యమంలా హరిత హారం కార్యక్రమం చేపట్టాలన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంతోనే సంక్షేమ పథకాలు సంపూర్ణ విజయం సాధిస్తాయని, హరిత హారంలో అందరు పాలు పంచుకోవాలని కోరారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఈ వర్షా కాలంలో ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. నాటిన మొక్కలకు రక్షణ ఏర్పాడు చేయడంతో పాటు నీరు పోసి కాపాడాలని ఆమె సూచించారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ హరితహారంలో ప్రజా ప్రతినిధులు ఎక్కువ శ్రద్ధ తీసుకొని, మొక్కలు నాటడమే కాకుండా వాటి పరి రక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సిఇవో సూరజ్‌కుమార్, డిఎల్‌పివో శ్రీనివాసరెడ్డి, అటవీ శాఖ అధికారులు, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, డ్వామా పిడి గణేష్, స్థానిక ఆర్డీవో సి నారాయణరెడ్డి, అధికారులు, డివిజన్ పరిధిలోని ఎంపిపిలు, జడ్పీటిసిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.