కరీంనగర్

ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 24: ప్రభుత్వం కరెంటు, బస్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఇందిరా చౌక్ వద్ద ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటన్నర పాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోగా వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు, బస్ చార్జీలను ఏకకాలంలో పెంచి పేద ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. వర్షాలు లేక ఒక పక్క రైతులు దుర్భర జీవితం గడుపుతుంటే, ఇటు తాగునీరు లేక గ్రామాలు, పట్టణ ప్రజలు విలవిలలాడుతుంటే ప్రభుత్వం ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచడం సమంజసంకాదన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికైనా కళ్ళుతెరిచి వెంటనే చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరెంటు చార్జీలు పెంచడం వల్ల ప్రజలపై సుమారు 1527 కోట్ల బారం పడుతుందని అలాగే బస్సుల చార్జీలు పెంచడంతో ప్రయాణికులపై 286 కోట్ల భారం పడుతుందని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రకాష్, కర్ర రాజశేఖర్, రవి, చేర్ల పద్మ, అంజన్‌కుమార్, మాదాసు శ్రీనివాస్, నిఖిల్ చక్రవర్తి, పోతారపు సురేందర్, గడ్డం విలాస్‌రెడ్డి, ఆకుల రాము, సరిళ్ళ ప్రసాద్, సుధీర్‌రెడ్డి, సాయికృష్ణ, ముక్క భాస్కర్, రాంరెడ్డి, పడిశెట్టి భూమయ్య, బోనాల శ్రీనివాస్, గుగ్గిళ్ళ శ్రీనివాస్, ఆంజనేయులు, ఆకుల రవి, పొన్నం మధుతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.