కరీంనగర్

ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమ్మె నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీగల్ (కరీంనగర్), జూన్ 27: రాష్టవ్య్రాప్తంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ జూలై 1 నుండి ఉద్ధృతంగా సమ్మె చేపట్టనున్నట్లు న్యాయస్థానం ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ న్యాయసేవాసదన్ భవనంలో జిల్లా అధ్యక్షుడు రమణారావు, ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ న్యాయస్థాన ఉద్యోగులు గత నెలలోనే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో జూలై 1 నుంచి సమ్మెబాట చేపడుతామని హైకోర్టుకు నోటీస్ ఇచ్చినట్లు సమావేశంలో పేర్కొన్నారు. న్యాయస్థాన ఉద్యోగులు ఆంధ్రాప్రాంత అధికారుల కుట్రతో వివక్షకు గురవుతున్నారని, రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడిచినప్పటికీ హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. శెట్టి కమిషన్ ఇచ్చిన ప్రతిపాదనలు అమలుచేయక తమ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలాగా న్యాయస్థాన ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తారని, ఉద్యోగాలు తొలగించినా భయపడవద్దని తెలిపారు. ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణలోనే విధులు నిర్వహిస్తామని ఇచ్చిన ఆప్షన్లతో నియామకాలు జరిగితే మరో 20 ఏండ్లపాటు తెలంగాణలో ఏ న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులుగా పదవి చేపట్టరన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం మాట్లాడుతూ ఆంధ్రా ఉద్యోగులు, న్యాయమూర్తులు వెంటనే వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలని తెలిపారు. న్యాయస్థాన ఉద్యోగుల తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిచో సమ్మె చేస్తామని పిలుపునిచ్చారు. న్యాయస్థాన ఉద్యోగులు ఇతర ఉద్యోగులతో పోలిస్తే రోజుకు 10 నుండి 12 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలో రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కార్యదర్శి రవీందర్ రావులను హైకోర్టు సస్పెండ్ చేశారనే విషయాన్ని తెలుసుకొని వీరికి మద్దతుగా జిల్లాలోని అన్ని కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయస్థాన ఉద్యోగులు కరీంనగర్‌కు చేరుకొని పెద్దఎత్తున అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రవిశంకర్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.