కరీంనగర్

విద్యార్థుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, నవంబర్ 28: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎబివిపి ఆధ్వర్యంలో శనివారం ఎస్సారార్ కళాశాల సమీపంలో కరీంనగర్ -జగిత్యాల రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ రహదారిపై కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎడవెల్లి శశిధర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల కాకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్, ప్రవీణ్, అనిరుద్, వెంకటేష్, జీవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండిలో...
చొప్పదండి: పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటు శనివారం చొప్పదండి ఎబివిపి శాఖ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద రాస్తారోకో, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉపకార వేతనాలు చెల్లించక పోవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వేతనాలు ఒకే సారి చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు ఏముండ్ల సంపత్, బత్తిని హరీష్, యుగేందర్, రాజుకుమార్, రాజు, శ్రావణ్, కళ్యాణి, సౌజన్య, అనూష పాల్గొన్నారు.

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
సుల్తానాబాద్, నవంబర్ 28: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో శనివారం పోలీస్ అమరవీరుల స్మారక జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను పెద్దపల్లి డిఎస్పీ నల్ల మల్లారెడ్డి ప్రారంభించారు. బిసి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కన్న రమేష్ ఆధ్వర్యంలో ఈ క్రీడాపోటీలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాలోని పలు మండలాల నుండి వాలీబాల్ క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారు. క్రీడాకారులతో డిఎస్పీ నల్ల మల్లారెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఇందులో సిఐ శ్రీనివాస రావు, ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ అజయ్, ఎంపిటిసి సభ్యురాలు వెంకటమ్మ, దీకొండ భూమేష్, సింగిల్‌విండో చైర్మన్ కల్లెపల్లి జానీ పాల్గొన్నారు.

దేశ సంస్కృతికి జీవం పోసేది తెలుగు భాష
* రాష్టప్రతి అవార్డు గ్రహీత రామకృష్ణ
చొప్పదండి, నవంబర్ 28: భారత దేశ సంస్కృతిని పరిరక్షించడమే కాకుండా ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచేది కేవలం తెలుగు భాష మాత్రమేనని ప్రముఖ వక్త, రాష్టప్రతి అవార్డు గ్రహీత కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం చొప్పదండి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో తెలుగు భాష పండిత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, తెలుగు భాష పండిత శిరోమణి అవార్డు గ్రహీత సంబోజి శేఖర్‌కు ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సమ్మేళన సన్మానం కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన రామకృష్ణ మాట్లాడారు. తెలుగు భాష ఉనికి కనుమరుగు అవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన శేఖర్ ఇలాంటి అవార్డు అందడం ద్వారా తెలుగు భాషకు ఊపిరి పోసినట్లు అయిందని పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగు భాషకు మంచి ఆదరణ ఉందన్నారు. కానీ నేడు మన తెలుగు భాషను బతికించుకునేందుకు మనం అందరం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆంగ్ల మాధ్యంపై ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని, మాతృ భాషలోనే విద్యభోదన చేస్తే మనోవికాసం కలుగుతుందని పేర్కొన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని కోరారు. అనంతరం తెలుగు భాష పండిత శిరోమణి అవార్డు గ్రహీత సంబోజి శేఖర్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ అభినందన సభను గ్రామ పంచాయితీ, మండల ప్రజా ప్రతినిధులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం, స్వచ్ఛంద సంఘాలు నిర్వహించాయి. ఈ కార్యాక్రమంలో జడ్పీటిసి ఇప్పనపల్లి సాంబయ్య, ఎంపిటిసిలు తిరుపతి, రంగన్న, భీమా శ్యాం, సభాధ్యక్షుడు భూమయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సింగిల్‌విండో చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు ఆనందరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కో-ఆప్షన్ జహీర్, జాగృతి అధ్యక్షుడు ఛత్రపతి శ్రీనివాస్, ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ అరుణాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణ, అశోక్, ఉపసర్పంచ్ చందు, తదితరులు పాల్గొన్నారు.

కోరుట్లను జిల్లాగా మార్చకపోతే మరో ఉద్యమం
* జిల్లా సాధన సమితి ర్యాలీ, ధర్నా, రాస్తారోకో
* స్తంభించిన ట్రాఫిక్
కోరుట్ల, నవంబర్ 28: కోరుట్ల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తరహాలోనే మరో ఉద్యమాన్ని చేపడతామని జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం కోరుట్లలో భారీ ర్యాలీ నిర్వహించి కొత్త బస్టాండ్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించగా కిలో మీటర్ దూరం వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు చెన్న విశ్వనాథం, ఎంఎ గఫార్, అల్లె సంగయ్య మాట్లాడుతూ కోరుట్లను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ద్వారా సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అయినా నిర్లక్ష్యంచేస్తే తెలంగాణ రాష్టస్రాధన ఉద్యమించిన తరహాలోనే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. కరీంనగర్ - నిజామాబాద్ జిల్లాలకు సమానంతరంగా మధ్యలో ఉన్న ఉన్న కోరుట్ల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాదని జిల్లా కేంద్రం ఏర్పాటు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. జిల్లా సాధన సమితి భారీ ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాల అక్కడే గంటన్నర సేపు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించి పోయింది. ప్రయాణికులు పడుతున్న బాధలు గమనించిన ఆందోళనకారులు ధర్నా,రాస్తారోకో విరమించడంతో పాటు కోరుట్లను జిల్లాగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్ ఆసోసియేషన్ నాయకులు ఎంఎ భారీ, బ్రహ్మన్నగారి శంకర్‌శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి
ముకరంపుర (కరీంనగర్), నవంబర్ 28: మహాత్మ జ్యోతిరావు ఫూలె వర్ధంతిని పురస్కరించుకొని శనివారం పలుచోట్ల, పార్టీ కార్యాలయాల్లో పూలె వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర శివారులోని శాతవాహన యూనివర్శిటి ఎదుట ఉన్న జ్యోతిబా ఫూలె విగ్రహానికి జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్, టిడిపి కార్యాలయాల్లో, పలు సంఘాల ఆధ్వర్యాల్లో పూలెకు నివాళులర్పించారు. పూలె విగ్రహాలను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వమే విగ్రహాలను ఏర్పాటు చేయాలని బిసి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.