కరీంనగర్

మామ ఒక మాట..అల్లుడు ఒక మాట...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 27: భూ నిర్వాసితులు ఏది కోరుకుంటే దాని ప్రకారమే భూ సేకరణ చేపడతామంటూ సిఎం కెసిఆర్ ప్రకటిస్తే..ఆయన అల్లుడు నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేపడతాం...కానీ అంటూ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభాపక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జివో 123 కంటే 2013 చట్టం భూనిర్వాసితులకు మూడింతల సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం భూ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తోందని విమర్శించారు. చట్టానికి అతీతంగా నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా భూ సేకరణ చేయాలని చూడటం సరికాదని, ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేవిధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా..2013 చట్టం సెక్షన్ 26 ప్రకారం బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా సవరణ చేసి, రిజిస్ట్రేషన్ ఆఫ్‌డేట్ చేసిన తదుపరి మాత్రమే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పద్ధతిన భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అప్పుడే భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయంపై సిఎం కెసిఆర్‌కు విన్నవించననున్నటు తెలిపారు. భూ సేకరణ విషయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ తరువాత ఉత్పన్నమయ్యే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని, చట్టాన్ని విస్మరించి మిగులు చేయగలుగుతామా? లేదా? అనే ధోరణితో భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టుల రీడిజైన్ నిర్ణయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కానుందని ఆరోపించారు. అవసరం ఉన్నా, లేకున్నా గతంలో ఉన్నదానికంటే రెట్టింపు అంచనాలతో ఇష్టారీతిన ప్రాజెక్టుల రీడిజైన్లు చేస్తుందని ఆరోపించారు. గతంలో కెసిఆర్ కరీంనగర్ ఎంపిగా ఉన్న సమయంలో మిడ్‌మానేర్ భూ నిర్వాసితుల కోసం ఉందాం, తిందాం, పందాం అంటూ ప్రాజెక్టు వద్ద దీక్ష చేపట్టారని, ఆయన చూపిన బాటనే కదా ఇది, ఇప్పుడు నిర్వాసితుల గురించి మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. భూ నిర్వాసితులకు మెరుగైన జీవనం ప్రసాదించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు నాయకులు గందె మాధవి, మహేష్, వీరారెడ్డి, వేదం, కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.