కరీంనగర్

ఏడాదిలో 250 గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 27: రాష్ట్రంలో ఒక విద్యా సంవత్సరంలో 250 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనారిటీల కోసం ఇంత పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపట్టలేదని, తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ విద్యాసంవత్సరం మైనారిటీలకు 71 పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు మానవ విలువలు నేర్పుతారని, పేద ప్రజలకు మెరుగైన విద్య, వైద్యాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆగస్టుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.15 కోట్లతో ఫర్నిచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం రూ.130 కోట్లతో వౌలిక వసతులను కల్పించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రజలకు మెరుగైన సేవలను అందించగలరని అన్నారు. గత ప్రభుత్వాలకు సంక్షేమ కార్యక్రమాల పట్ల చిన్నచూపు ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం విద్యకు పెద్దఎత్తున నిధులను ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రాచీణ భారత దేశంలో గురుకులాల ద్వారానే విద్యను బోధించేవారని అన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదివిన తాను ఈనాడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. కరీంనగర్ ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా మైనారిటీలకు గురుకుల పాఠశాలల ద్వారా విద్యను అందించడం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలు విద్యారంగంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో గురుకులాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఉపాధ్యక్షులు, ఎసిబి డిజిపి ఎ.కె.ఖాన్ మాట్లాడుతూ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థిపైన 80 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. ఏ ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో మైనారిటీల కోసం పాఠశాలలను స్థాపించలేదన్నారు. అన్ని పాఠశాలలు ప్రారంభమైతే 17వేల మంది విద్యార్థులు ప్రతీ సంవత్సరం బయటకు వస్తారని వివరించారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు ప్రసంగించారు.