కరీంనగర్

హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నమే ఇఫ్తార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూన్ 28: హిందూ ముస్లింల ఐకత్యకు చిహ్నంగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్‌హాల్లో నియోజకవర్గానికి చెందిన రెండు వేల మంది ముస్లింలకు ఇఫ్తార్ విందును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వపరంగా ఇఫ్తార్ విందులను ఇస్తున్నదని చెప్పారు. మైనార్టీల సంక్షేమం టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక నిధుల్ని కేటాయించిందని తెలిపారు. ఈసంవత్సరమే 120 మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. రూ.1200కోట్లతో ముస్లింలకు షాదీ ముబారక్ వంటి సంక్షేమ పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకోసం కమిటీ వేసినట్లు ఆయన చెప్పారు. కమిటీ నివేదిక రాగానే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి దిల్లీకి పంపుతామని చెప్పారు. ముందుగా 400 పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నామాల ఉమాలక్ష్మిరాజం, ఎంపిపి రంగు వెంకటేశం, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పొలాస నరేందర్, టిఆర్‌ఎస్ కోయినేని శ్రీనివాస్, సెస్ డైరక్టర్ రామతీర్థపురాజు, మహేశ్, ప్రసాదరావు, భాస్కర్‌రావు, ముప్పిడి శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అంజత్ పాషా, బాబా, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
మహిళ డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన
మండలంలోని అగ్రహారంలో మహిళా డిగ్రీ కళాశాల నూతన భవనానికి ఎమ్మెల్యే రమేశ్‌బాబు శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1కోటి నిధులను కేటాయించినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా పట్టణంలోని మార్కెట్ యార్డులో డివిజన్ ఎడి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు పట్టణ శివారులోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.