కరీంనగర్

కోర్టు గేట్‌కు తాళం వేసిన న్యాయవాదుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూన్ 30: పలు డిమాండ్లతో బుధవారం మండలంలోని రంగంపల్లిలో గల సబ్ కోర్టు ప్రధాన గేట్‌కు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పలువురు న్యాయవాదులను పెద్దపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణకు ప్రత్యేక ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు చేయాలని, న్యాయ అధికారులను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర న్యాయమూర్తులను వారి ప్రాంతాలకు పంపించాలని తదితర డిమాండ్లతో ఇక్కడి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం కోర్టు గేట్‌కు తాళం వేసిన న్యాయవాదులు నిరసన తెలియజేశారు. గేట్‌కు తాళం వేసిన బార్ అసోసియేషన్ అధ్యక్ష; కార్యదర్శులతో పాటు న్యాయవాదులు బొంకూరి శంకర్, వాస్, మార కిశోర్, బొంకూర్ సంతోష్ బాబ్జి, తిరుపతిరావు, వెంకటేష్, శ్రీ్ధర్, సత్యనారాయణ తదితరులను పోలీసులు అరెస్టు చేసి, వ్యక్తి గత పూచి కత్తుపై వదిలిపెట్టారు. అనంతరం బార్ అసోయేషన్ అధ్యక్షుడు దాసరి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తమపై ఎంత నిర్భందం అములు చేసిన, న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం ఆగదన్నారు.