కరీంనగర్

ప్రయాణికులకు మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర, (కరీంనగర్) జూన్ 30: ప్రయాణికులకు మెరుగైన సేవలందించే దిశగా రైల్వే డిపార్ట్‌మెంట్ కృషి చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ పిసి టంటా అన్నారు. గురువారం కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలను, సిబ్బంది పనితీరును, ఫైళ్ళను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పిసి టంటా మట్లాడుతూ గత రెండేళ్ల కాలంలో రైల్వే శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, గోదావరి పుష్కరాల సమయంలో ప్రయాణికుల కోసం 176 ప్రత్యేక రైళ్ళను నడిపిందన్నారు. ఇదివరకు మంచిర్యాల-మందమర్రి మద్యలో మూడో లైన్‌ను ఏర్పరిచినట్లు, రామగుండం స్టేషన్‌లో 3హెచ్‌పి సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి గత అక్టోబర్ నుండి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓదెల, పోత్కపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల సౌకర్యార్థం బేంచీలను ఏర్పర్చామని, అలాగే డిస్‌ప్లే బోర్డులను, ఆన్‌లైన్‌లలో, ఆప్‌లలో టికెట్లను త్వరితగతిన పొందవచ్చని ప్రయాణికులు ఇది గమనించాలన్నారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరమని అదేవిధంగా స్టేషన్‌లో పరిశుభ్రత పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ్భారత్ చేపట్టిందని రైళ్ళలో కూడా పాటిస్తున్నామన్నారు. ఎక్కడికక్కడా పెద్ద పెద్ద స్టేషన్లలో సిసి కెమెరాలు ఏర్పాటుచేశామని దొంగలను పట్టుకునేందుకు దోహదపడతాయన్నారు. అలాగే పరిసరాలను, స్టేషన్‌లలో ఉమ్మివేసినా, చెత్త చెదారం వేసినా 500 రూపాలయ జరిమానా విదిస్తామన్నారు. జమ్మికుంట, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా చేస్తామన్నారు.