కరీంనగర్

ఎల్లంపల్లి నీటితో చెరువులు, కుంటలు నింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, మార్చి 18: తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఎల్లంపల్లి నీటితో పెద్దపల్లి నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపిన తరువాతనే గజ్వేల్, సిద్ధిపేట, మెదక్ ప్రాంతాలకు తీసుకుపోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పాల రామారావు అధ్యక్షతన మండల పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయరమణారావు మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని అందించేందుకు గాను 40 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం హామీలను విస్మరించిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా హామీలను నెరవేర్చక కాలయాపన చేస్తుందని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు, రైతులకు రుణమాఫీ, మహారాష్టత్రో ప్రాజెక్టుల ఒప్పందం వంటి వాటిపై ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు డబుల్ బెడ్‌రూంలు అందజేయాలని, లేని పక్షంలో తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. అలాగే ఈ నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యకర్తలు ఇంటింటా పార్టీ జెండాను ఎగురవేస్తూ పెద్దఎత్తున సంబరాలు జరుపాలన్నారు. అలాగే ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందన్నారు. గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని, పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో రహదారుల నిర్మాణాలతో పాటు మంచినీటి ట్యాంకులతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి సాయిరి మహేందర్, నాయకులు పన్నాల రాములు, అమిరిశెట్టి తిరుపతి, వెగోళం అబ్బయ్య, కుమార్ కిషోర్, ఉస్తెం గణేష్, సతీష్, అశోక్, పిడుగు పోచాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతుల ముంగిట్లో కెడిసిసి బ్యాంకు సేవలు
* జిల్లా కెడిసిసిబి ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి
శంకరపట్నం, మార్చి 18: గ్రామాల్లో రైతుల ముంగిట్లకు కెడిసిసి బ్యాంకు సేవలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకులను ప్రారంభించినట్లు జిల్లా కెడిసిసిబి ఉపాధ్యక్షుడు ఉత్తిడి మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కెడిసిసి బ్యాంక్ ఉపకార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకునేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని అర్హులైన రైతులు తమ బ్యాంక్ ద్వారా సేవలు పొందాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాలలో రైతులు బ్యాంకింగ్ సేవలు లేక పంటలు పండించుకోలేక, ప్రకృతి సహకరించక వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెడిసిసిబి జిల్లాలోనే రైతులను అన్ని రంగాలలో ఆదుకునేందుకు సబ్సిడీపై వ్యవసాయ సంబంధించిన వస్తువులను అందజేస్తుందని ఆయన చెప్పారు. ఈ బ్యాంకుల ద్వారా రైతులు విద్య, బంగారు, రైతు పంట రుణాలు తదితర వాటిని తీసుకునే వీలుంటుందనే ఉద్ధేశంతోనే మండల కేంద్రంలో కెడిసిసిబి ఆధ్వర్యంలో బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు బ్యాంక్ సిబ్బందికి సహకరిస్తూ ఈ బ్యాంకు పరిధిలోని రైతులు తమ అవసరమైన రుణాలు పొంది సకాలంలో రుణాలను చెల్లించి బ్యాంక్ అభివృద్ధి కోసం కృషి చేయాలని, ఇందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు అండగా నిలువాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్ రమాదేవి, ఎంపిటిసి రామస్వామి, ఎంపిపి దొంగల విజయ, కెడిసిసిబి సిఓ సత్యనారాయణ, డిజిఎం నారాయణ, రవీందర్ రెడ్డి, మేనేజర్ నారాయణ రెడ్డి, శ్యాం సుందర్, రాజశేఖర్, సింగిల్‌విండో చైర్మన్లు హన్మంతరావు, పాపిరెడ్డి, శ్రీనివాస రావు, సిఓ కొరిమి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.