కరీంనగర్

సిరిసిల్ల ఆర్డీవోగా శ్యాంప్రసాద్‌లాల్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 4: సిరిసిల్ల ఆర్డీవోగా శ్యాంప్రసాద్‌లాల్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కరీంనగర్‌లో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌ను కలిసి రిపోర్ట్ చేశారు. అనంతరం సిరిసిల్ల ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డీవోగా పని చేసిన బానోతు భిక్షానాయక్ బదిలీపై వెళ్ళగా, బోధన్ ఆర్డీవోగా పని చేస్తున్న శ్యాంప్రసాద్‌లాల్‌ను గత మే 23న ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు, మంత్రి కెటిఆర్ విదేశీ పర్యటన తదితర కారణాలతో భిక్షానాయక్ ఇక్కడి నుండి రిలీవ్ కాలేదు. కాగా సోమవారం భిక్షానాయక్ రిలీవ్ కాగా, ఇదే రోజు శ్యాంప్రసాద్‌లాల్ బాధ్యతలు చేపట్టారు. శ్యాంప్రసాద్ గతంలో సిరిసిల్ల తహశీల్దార్‌గా పనిచేశారు. అలాగే జిల్లాలోని గంభీరావుపేట, బోయినపల్లి, పెద్దపల్లి, హజురాబాద్, కరీంనగర్, కోరుట్లలలో తహశీల్దార్‌గా పని చేశారు. 2011లో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేశారు. కరీంనగర్ ఆర్‌విఎం పిడిగా పని చేశారు. ప్రస్తుతం ఇక్కడికి ఆర్డీవోగా బదిలీ అయి బాధ్యతలు స్వీకరించారు.