కరీంనగర్

సింగాపురంలో మొక్కలు నాటిన ఎంపి కెప్టెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్ రూరల్, జూలై 8: హుజూరాబాద్‌లో జరిగిన హరితహారంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంతరావు శుక్రవారం పాల్గొన్నారు. మండలంలోని సింగాపురం కిట్స్ ఆవరణలో హరిత హారం కార్యక్రమాన్ని కెప్టెన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా కెప్టెన్‌తో పాటు ఎంపిపి వొడితెల సరోజినిదేవికి గ్రామస్థులు సర్పంచ్ కౌరు రజిత సుగుణాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, కిట్స్, సింగాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులతో విద్యార్థులతో కలిసి హరిత హారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు. ఆసుపత్రిలో బాలింతలకు చెక్కులను ఎంపి అందజేశారు. అనంతరం స్థానిక టిఆర్‌ఎస్ యువజన నాయకుడు మహ్మద్ అష్ఫక్ ఆశు నివాసానికి వెళ్లి రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.