కరీంనగర్

మహోద్యమంలా హరితహారం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 11: హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో మహోద్యమం లాగా కొనసాగుతోంది. ఈ నెల 8న జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మొక్కను నాటి ప్రారంభించగా, జిల్లా అంతటా కూడా అట్టహాసంగానే ప్రారంభమైంది. సోమవారం నాటికి హరితహారం కార్యక్రమం నాలుగవ రోజుకు చేరింది. తొలిరోజు జిల్లా అంతటా 6.17లక్షలు మొక్కలు నాటారు. అదేజోరు అలాగే కొనసాగుతోంది. వర్షంలో సైతం మొక్కలు నాటుతున్నారు. ప్రజలు, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలలు ఇలా ఒకటేమిటి అన్ని వ్యవస్థలు, అన్ని వర్గాల ప్రజలు హరితహారంపై కదులుతూ మొక్కలు నాటుతున్నారు. జిల్లాలో పక్షం రోజుల్లో 4కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోగా, నాలుగు రోజుల్లో 20,95,264 మొక్కలను నాటారు. హరితహారం కార్యక్రమానికి వర్షం కూడా బాసటగా నిలుస్తోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు నాటిన మొక్కలకు ప్రాణం పోస్తున్నాయి. హరితహారాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు కలెక్టర్ నీతూప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. హరితహారం విజయవంతం కోసం నిర్దేశించిన లక్ష్యాలను సాధించిన ఉద్యోగులకు రివార్డులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అలాగే లక్ష్యాలు, అధికారుల సూచనలను పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటూ ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటిసిలు వారి వారి ప్రాంతాల్లో జరుగుతున్న హరితహారంలో పాల్గొంటున్నారు. కాగా, హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం కెసిఆర్ ఈనెల 15న జిల్లాకు రానున్నట్లు సమాచారం. అధికారికంగా సిఎం పర్యటన ఖరారు కాకపోయినప్పటికీ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో సిఎం పాల్గొనున్నట్లు సమాచారం. మొత్తానికి జిల్లాలో హరితహారం మహోద్యమం లాగా కొనసాగుతుండగా, పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.